గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లూ ఫిల్మ్స్ ముఠా: కృష్ణాలోకి యువకుడి తోసివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Blue films gang busted in Vijayawada
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో గుట్టుగా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మతిస్థిమితంలేని బాలిక, రాంచరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు. ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్‌ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగర్ వద్ద గురువారం ఉదయం ఓ యువకుడిని ఇద్దరు దుండగులు కృష్ణా నదిలోకి తోసివేశారు. ఇనుప చువ్వలపై యువకుడు పడిపోవడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది.

దీన్ని గుర్తించిన స్థానికులు దుండగుల పట్టుకునేందుకు వెంటపడటంతో కృష్ణానదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రం గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలోని చౌడవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌వీఆర్‌జేసీ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి అనిల్ మృతి చెందాడు. అనిల్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

English summary
members od blue film business gang have been nabbed by police in Vijayawada of Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X