విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్: వీడిన కిడ్నాప్ మిస్టరీ, బాలుడు సురక్షితం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం లక్ష్మీపురంలో కిడ్నాప్‌నకు గురైన పదేళ్ల బాలుడు సురక్షతంగా బయటపడగలిగాడు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఇద్దుర వ్యక్తులను గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేశారు. కోరుబిల్లి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ దుండగులు అపహరించి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దామోదర్ సోమవారం రాత్రి తన ఇంటికి సమీపంలో జరిగిన వినాయక నిమజ్జన కార్యకమాన్ని చూసేందుకు బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన దామోదర్ తిరిగి ఇంటికి రాలేదు.

దామోదర్ తల్లిదండ్రులు సోమవారం రాత్రి నుంచి తమ కుమారుని కోసం వెతకడం ప్రారంభించారు. మంగళవారం కూడా వెతికినా ప్రయోజనం కనిపించలేదు. అయితే బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీనివాసరావుకు ఫోన్ వచ్చింది. దామోదర్‌ను కిడ్నాప్ చేశామని, 30 లక్షల రూపాయలు చెల్లిస్తే, బాలుడిని తిరిగి అప్పగిస్తామని ఆ ఫోన్ కాల్ సమాచారం. పావుగంట వ్యవధిలో శ్రీనివాసరావుకు పలు ఫోన్ కాల్స్ వచ్చాయి. వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు ఈ విషయాన్ని తెలియచేశారు.

boy kidnapped at visakhapatnam is end

గురువారం ఉదయం నుంచి పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్ల కోసం గాలింపు ప్రారంభించారు. శ్రీనివాసరావుకు బుధవారం గోపాలపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, పెందుర్తికి సమీపంలోని కొత్తపాలెం దగ్గర నుంచి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఎసిపి సిఎం నాయుడు పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.

ఒక బృందాన్ని గాజువాక, మరో బృందాన్ని సబ్బవరం, చోడవరం, మూడో బృందాన్ని నర్సీపట్నం వైపునకు పంపించారు. ఒక బృందం పెందుర్తి పరిసర ప్రాంతాల్లోనే గాలిస్తున్నారు. కోరుబిల్లి శ్రీనివాసరావు పెందుర్తి ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి పెద్దగా ఆస్తి కూడా లేదు. శత్రువులు కూడా లేరు. ఈ కిడ్నాప్‌ను పోలీసులు సవాలుగా తీసుకోని కేసును ఛేదించారు.

English summary
Finance businessman's son Damodar has been kidnapped and was demanded Rs 30 lakhs as ransom in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X