వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకు వేధింపులు: టీ బస్సుల్లో ముళ్లకంచె

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Buses in Telangana to have grills separating men and women
హైదరాబాద్: బస్సుల్లో మహిళలను ఆకతాయిల వేధింపుల నుండి కాపాడేందుకు ఆర్టీసీ ప్రయోగాత్మక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మహిళ సీట్ల వెనుకాల ఇనుప కంచెల తరహాలో ఏర్పాటు చేయడంతోపాటు వారి కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది.

మహిళల భద్రత పైన పూనం మాలకొండయ్య ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ప్రయోగాత్మకంగా హైదరాబాదులో అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక్కడి ఫలితాల అధ్యయనం తర్వాత దశలవారీగా మిగిలిన నగరాలకు విస్తరిస్తారు. వీటి అమలుపై ఆర్టీసీ అధికారులు సోమవారం ఆయా నమూనాలను పరిశీలించారు.

సికింద్రాబాద్ నుండి అఫ్జల్ గంజ్ మార్గంలో నడిచే బస్సుల్లో (8ఏ) మహిళలకు ప్రత్యేకించిన సీట్ల వెనుకాల రక్షణ ఏర్పాట్లు చేస్తారు. మహిళల సీట్ల వెనుక కూర్చునే పురుషుల వేధింపుల నుండి వారిని కాపాడాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవి రమణ తెలిపారు. అక్టోబర్ 1 నుండి దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.

English summary
The zanana-mardana system practiced in the Muslim community will now be adapted in the city for the safety of women. From October 1, the TS Road Transport Corporation will operate buses with grills separating men’s and women’s sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X