హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చందన బ్రదర్స్ చోరీ కేసు: దొంగల పట్టివేత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్‌పల్లి చందన బ్రదర్స్ చోరీ కేసును పోలీసులు గురువారంనాడు చేదించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు పేరు మోసిన దొంగలను, ముగ్గురు రిసీవర్లను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నగలును, నగదున స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 7వ తేదీ అర్థ రాత్రి చందన బ్రదర్స్ దుకాణంలోకి ప్రవేశించి భారీగా బంగారాన్ని, రూ. 15 లక్షల రూపాయల నగదును దొంగలు ఎత్తుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో చందన బ్రదర్స్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా గాలింపు చర్యలు చేపట్టి పక్కా సమాచారం మేరకు దొంగలను పట్టుకున్నారు.

వేర్వేరు గదుల్లో ఉంటూ..

వేర్వేరు గదుల్లో ఉంటూ..

వేర్వేరు చోట్ల వేర్వేరు గదుల్లో ఉంటూ ఒక చోట కలుసుకుంటూ చోరీలకు పథకం వేసుకుని పక్కా ప్లాన్ ప్రకారం చోరీలు చేయడం ఇద్దరు అలవాటు చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

పక్కా సమాచారం మేరకు..

పక్కా సమాచారం మేరకు..

తమకు అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు కట్టా శివశంకర్, కట్టా సత్తిబాబులను పోలీసులు కూకట్‌పల్లిలోని మలబార్ గోల్డ్ షాప్ వద్ద గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు.

రిసీవర్స్ అరెస్టు

రిసీవర్స్ అరెస్టు

సోరంపూడి సత్యనారాయణ (50), కట్టా లక్ష్మి ((40), చెల్లబోయిన వరలక్ష్మి (33) అనే రిసీవర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

నగలు, నగదు స్వాధీనం

నగలు, నగదు స్వాధీనం

నిందితుల నుంచి పోలీసులు 12 లక్షల 50 వేల విలువ చేసే 45 తులాల బంగారం ఆభరణాలను, 5.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

చందన బ్రదర్స్ చోరీ కేసులో ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 17 లక్షల 74 వేల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర దొంగలని పోలీసులు పోలీసులు చెప్పారు. వారిని కట్టా శివశంకర్ అలియాస్ లడ్డూ(26), కట్టా సత్తిబాబు(24)లుగా గుర్తించారు.

వీరిలో తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని పాక గ్రామానికి చెందిన కట్టా శివశంకర్ సికింద్రాబాదులోని ఆల్వాల్ ఉంటుండగా, కాకినాడలోని చిదిగికు చెందిన కట్టా సత్తిబాబు హైదరాబాదులోని దోమలగుడాలో ఉంటున్నాడు. వారిద్దరిపై కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

English summary
The Crime party of CCS Kukatpally have nabbed two inter state habitual and notoroius, hous burhlars namely Katta Shiva Shankar alias Laddu and Katta Sattibabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X