వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుని 'పవన్‌కళ్యాణ్' ఇబ్బందిపెడ్తున్నారా, రోజా కూడా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఇబ్బంది పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేసిన పవన్.. నేరుగా చంద్రబాబును ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు! అయితే, పదే పదే పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ గెలిచిందని సొంత పార్టీ నుండి విపక్షాలు కూడా చెబుతుండటం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదట.

టీడీపీ అధికారంలోకి రాగానే పలువురు టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబుతో పాటు పవన్ ఇంటికి కూడా క్యూ కట్టారు. టీడీపీ గెలుపులో పవన్ పాత్ర ఎంతో ఉందని వారు కొనియాడారు. ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అస్త్రంలా కూడా ఉపయోగపడుతుందంటున్నారు. బాబు తప్పుడు హామీలు, మోడీ, పవన్‌ల హవా వల్లనే టీడీపీ గెలిచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

తాజాగా నగరి ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేత రోజా మంగళవారం మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందన్నారు. ఇలా సొంత పార్టీ, మిత్ర పక్షం బీజేపీ, విపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా పదే పదే పవన్ పేరును ప్రస్తావించడం రుచించడం తెలుగు తమ్ముళ్లకు రుచించకపోవచ్చునంటున్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి రావడానికి బాబు పాలనా పటిమ, మోడీ హవా, పవన్ ప్రచారం కలిసి వచ్చిందని ఇంకొందరు అంటున్నారు.

 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని విపక్షాలు కూడా పదే పదే ప్రస్తావించడం తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదట!

 టీడీపీ, బీజేపీ

టీడీపీ, బీజేపీ

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలువురు టీడీపీ, బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా కలుసుకున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, నరేంద్ర మోడీ హవా, బాబు అబద్దపు హామీ కారణంగానే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి నుండి ఆరోపిస్తోంది. టీడీపీకి తమ కంటే కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది.

రోజా

రోజా

తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, నగరి శాసన సభ్యురాలు రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు, పవన్

చంద్రబాబు, పవన్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, అధికారంలోకి వచ్చినందున పాలన పైన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారోననే సస్పెన్స్ మాత్రం నెలకొని ఉంది.

English summary
It is said that Telugudesam Party is irked with 'Pawan Kalyan'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X