హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పాలనపై బాబు, లోకేష్ కంటే బ్రాహ్మిణి బెటర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలన పైన తాను స్పందించడం ధర్మం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సంపాదకులతో ఇష్టాగోష్టిగా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.

విభజనలో హేతుబద్ధత లోపించిందన్నారు. హేతుబద్ధత లేని విభజన వల్లే అనర్థాలు అన్నారు. నిత్యం వివాదాలు, విద్వేషాలతో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. కొత్త రాజధాని పైన, నిర్మాణ, విధానాల పైన ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు.

Chandrababu praises Brahmini

పార్టీల కోసం పేపర్లు పెడతారా అని పరోక్షంగా కేసీఆర్, వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. అవినీతి సొమ్ముతో పేపర్లు, టీవీలు పెడితే అధోగతే అన్నారు. నమస్తే తెలంగాణ, సాక్షి మీడియాను ఎవరు అడ్డగించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ చాలా బలంగా ఉందని చెప్పారు.

బ్రాహ్మిణికి కితాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మిణిల పైన ప్రశంసలు కురిపించారు. వారు మంచి అడ్మినిస్ట్రేటర్లు అన్నారు. లోకేష్ కంటే బ్రాహ్మిణి మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu has praised Brahmini.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X