వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ప్రేమతో మాట్లాడారు: బాబు, జగన్‌పై వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మద్దతు తెలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో తన అధ్యక్షతన జరిగిన ఏపీ టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఆ విషయం చెప్పారు. ఆదివారంనాడు రాజ్‌భవన్‌లో కేసీఆర్‌తో జరిగిన భేటీ వివరాలను శాసనసభ్యులకు వివరించారు.

కెసిఆర్ ఆప్యాయంగా మాట్లాడారన్నారు. గతంలో కేసీఆర్ టీడీపీ పార్టీలో ఉన్నప్పటి విషయాలను, కలిసి పనిచేసినప్పటి అనుభవాలను పంచుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాలపైన కేసీఆర్ కొంత ఆవేదన వ్యక్తం చేశారని కూడా చెప్పారు. బిల్లులో ఏపీ ప్రత్యేక ప్రత్తిపత్తికి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చాలిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారని ఎమ్మెల్యేలకు వివరించారు.

Chandrababu says KCR for special status to AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందిగా కేంద్రంతో మాట్లాడాలని గవర్నర్‌కు కేసీఆర్ సూచించినట్లు చెప్పారు. ఏపీ సమస్యలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, తాను కూడా తెలంగాణ సమస్యలపై సానుకూలంగా ఉంటానని కేసీఆర్‌కు హామీ ఇచ్చానన్నారు.

అవసరమైతే ఏపీతో సమానంగా తెలంగాణకు కూడా అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతానని తాను కేసీఆర్‌కు హామీ ఇచ్చానని ఏపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది.

హత్యారాజకీయాలను ప్ర్తోత్సహించిన చరిత్ర తమ తెలుగుదేశం పార్టీకి లేదని చంద్రబాబు అన్నారు. హత్యారాజకీయాలపై దొంగే.. దొంగ అని అరిచినట్లుగా జగన్ వైఖరి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించాలనేదే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నమని ఆయన అన్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొడుతామని చెప్పారు. జెండా మోసిన కార్యకర్తలకు కచ్చితంగా పార్టీలో ప్రాముఖ్యం ఉంటుందని చంద్రబాబు చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu informed to the Telugudesam party MLAs that Telangana CM expressed concern over the problems of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X