వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెపిపై ఉన్నా:పవన్‌కళ్యాణ్‌ను సాధించిన బాబు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం పవర్ స్టార్ అతిథి గృహంలో సమావేశమయ్యారు.

తెలంగాణ, సీమాంధ్రలో ప్రచార వ్యూహంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. చంద్రబాబును పవన్ కళ్యాణ్ తేనేటి విందుకు ఆహ్వానించారు. దీంతో బాబు ఆయన ఇంటికి వచ్చారు.

చంద్రబాబుతో తన అతిథి గృహంలో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. తాను టిడిపి, బిజెపి కూటమికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. కాగా, పవన్ కళ్యాణ్ మద్దతు కోసం చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

ఓట్లు చీలకూడదనే జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. బుధవారం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

రెండు ప్రాంతాల్లో సుస్థిర ప్రభుత్వాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని విభజించిన విధానం తనను బాధ పెట్టిందన్నారు. ఎన్డీయే గెలుపు దేశంతోపాటు రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో అవసరమని పవన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

గతంలో చంద్రబాబు ఎన్డీయేతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. మోడీ పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అమర్యాదగా మాట్లాడటం సరికాదన్నారు. కెసిఆర్ వైఖరి వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పవన్ హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

బిసి నాయకుడైన శ్రవణ్ కుమార్‌ను తెరాస నాయకులు అనేక రకాలుగా అవమానించారని మండిపడ్డారు. చంద్రబాబుకు తన మద్దతు తెలుపుతున్నానని, సాధ్యమైనంత వరకు ప్రచారంలో పాల్గొంటానని పవన్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

మల్కాజ్‌గిరిలో జెపికి మద్దతివ్వాలని తన మనసులో ఉందని కానీ కూటమి ధర్మాన్ని పాటించి ఎన్డీఏ అభ్యర్థికే మద్దతివ్వనున్నట్లు తెలిపారు. జెపి మరో రకంగా భావించొద్దని పవన్ కోరారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

మల్కాజిగిరి టిడిపి అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించాలని మోడీ కోరడంతో జెపి తరపున ప్రచారం చేయడం లేదని ఆయన వెల్లడించారు. అలాగని జెపికి తాను వ్యతిరేకం కాదని పవన్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

రాష్ట్ర విభజన జరిగిపోయింది... ఇప్పుడు సమర్ధులైన నాయకులు అవసరమని పవన్ అన్నారు. పదేపదే మాట మార్చే నాయకులు తెలంగాణకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని వెనక్కి వెళ్లేది లేదని పొట్లూరిని ఉద్దేశించి చెప్పారు.

English summary

 Apparently shaken by pre-poll surveys predicting a defeat for the Telugu Desam in Seemandhra, which he was banking on, and Telangana, party chief N. Chandrababu Naidu in a big climbdown drove over to the residence of actor and Jana Sena chief Pawan Kalyan on Wednesday to seek his support for the BJP-TD alliance in both regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X