వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వ్యూహం: ఎన్టీఆర్ ఫ్యామిలీ చిందరవందర

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహానికి స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు కకావికలమయ్యారు. ఓ పార్టీకీ ఓ సీటుకూ కాకుండా పోయారు. ఇతర పార్టీల్లో మనుగడ సాగిద్దామనే ప్రయత్నాలకు కూడా విఘాతం ఏర్పడింది. విశాఖపట్నం లోకసభ సీటును ఆశించి బిజెపిలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరి కడప జిల్లాలోని రాజంపేట లోకసభ స్థానంలో పోటీ చేయాల్సి వస్తోంది. రాజంపేట సీటులో విజయం సాధించడం ఆమెకు ఆషామాషీ ఏమీ కాదు.

విభజనపై వ్యతిరేకతతో కాంగ్రెసును వీడిన దగ్గుబాటి దంపతులు ఇప్పుడు రాజకీయాల్లో గడ్డు సమస్యను ఎదుర్కుంటున్నారు. తెలుగుదేశంతో బిజెపి పొత్తు పెట్టుకోవడంతో భార్య పురంధేశ్వరి విజయం ఖాయం కాని సీటుకు మారాల్సి వస్తే దగ్గుబాటి వెంకటేశ్వర రావు పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఆయన బిజెపిలో కూడా చేరలేదు. కాంగ్రెసుకు రాజీనామా చేసినప్పుడే తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు.

Chandrababu strategy: NTR family in trouble

కాగా, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పరిస్థితి ఎటూ కాకుండా పోయేట్లుంది. బిజెపిలో చేరుదామని అనుకున్నా తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా అక్కడ తగిన స్థానం లభించే అవకాశం లేదు. హిందూపురం నుంచి పోటీ చేయడానికి ఉబలాటపడిన హరికృష్ణ ఆ సీటును తన సోదరుడు బాలకృష్ణకు కేటాయించడంతో కృష్ణా జిల్లాలోని ఏదైనా సీటు నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.

కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా నూజివీడు శాసనసభా స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. చివరి వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయనను ఆశపెట్టారు. కానీ చివరి నిమిషంలో హరికృష్ణకు చేయి ఇచ్చారు. దీంతో హరికృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. దానికితోడు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారు.

ఓవైపు, తనకు నచ్చని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అయితే, మరోవైపు తనతో పాటు నడుస్తున్న తన వియ్యంకుడు, ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణకు హిందూపురం శాసనసభా టికెట్ ఇచ్చారు. అది కూడా చంద్రబాబుతో తీవ్రంగా అంతర్గత పోరాటం చేసి బాలయ్య ఆ సీటును దక్కించుకున్నట్లు చెబుతున్నారు.

తన కుమారుడు నారా లోకేష్‌ను చంద్రబాబు నాయుడు ఎన్నికల బరిలోకి దింపలేదు. కానీ, ఆయనకు తన వారసత్వాన్ని అందించడానికి మాత్రం సన్నద్ధమైనట్లు అర్థమవుతోంది. నారా లోకేష్ ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్టార్ కాంపైనర్ అయ్యారు. సీమాంధ్రలో టిడిపి గెలిస్తే నారా లోకేష్ క్రిడెట్ కొట్టేసే అవకాశాలున్నాయి. రాజకీయ చాతుర్యంలో దిట్ట అయిన చంద్రబాబును ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు.

English summary
According to political analysts _ Telugudesam party president Nara Chandrababu Naidu is in a bid to sideline NTR's family members like Purandheswari and Harikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X