హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు.. సెల్ ఫోన్ పట్టిచ్చింది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాతబస్తీ శక్కర్ కోటలోని బాలాజీ ఆభరణాల దుకాణ యజమాని దినేశ్ సోనినీ తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్న నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు ఒడిషాకు చెందిన నగల వ్యాపారి గౌతమ్ (34), అతని ఇద్దరు అనుచరులు భాస్కర్ మిత్ర, సిద్దేశ్వర్ రామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు వ్యాపారి దినేశ్ సోని సెల్ ఫోన్ సైతం తీసుకెళ్లడంతో సులువుగా దొరికారని పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి తుపాకీ, నాలుగు బుల్లెట్లు, రూ.5 లక్షల నగదు, రత్నాలు, వజ్రాలు పొదిగిన చేతి ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేశారు. గత నెల 29న చార్మినార్ సమీపంలోని దినేష్‌సోని జ్యూయలరీ దుకాణంలో చొరబడి ఆ యజమానిని తాళ్లతో కట్టి పడేసి, రివాల్వర్‌తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... రెండు బృందాలుగా ఏర్పడి ఒడిషాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా విజయవాడలో వీరిని అరెస్టు చేసి తీసుకొచ్చినట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. వ్యాపార లావాదేవీల్లో విభేదాల కారణంగానే తన అనుచరులతో వచ్చి దినేశ్ సోనినీ బెదిరించి నగలు తీసుకెళ్లాడని పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి బాలాజీ ఆభరణాల దుకాణంలో నగలు దోచుకున్న నిందితులను నుంచి స్వాధీనం చేసుకుని ప్రదర్శనకు ఉంచిన పోలీసులు.

 తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..


నిందితుల వద్ద నుంచి తుపాకీ, నాలుగు బుల్లెట్లు, రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..


నిందితుల వద్ద నుంచి తుపాకీ, నాలుగు బుల్లెట్లు, రూ.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..


నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగలు, వజ్రాలను ప్రదర్శనకు ఉంచిన దృశ్యం.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..


ప్రధాన నిందితుడు ఒడిషాకు చెందిన నగల వ్యాపారి గౌతమ్ (34), అతని ఇద్దరు అనుచరులు దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

ఈ రోజు మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేశారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌ను చూపిస్తున్న డిప్యూటీ కమిషనర్ వి. సత్యనారాయణ.

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..

తుపాకీతో బెదిరించి నగలు దోచుకున్నారు..


వ్యాపార లావాదేవీల్లో విభేదాల కారణంగానే తన అనుచరులతో వచ్చి దినేశ్ సోనినీ బెదిరించి నగలు తీసుకెళ్లాడని పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు.

English summary
Deputy commissioner police V sataya naryana explaining recovered things of Three Robberers of Odessa State held-seized one fire arm i.e., one Country made Revolver and 04-live rounds & entire case property pertains to Charminar P.S. Robbery case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X