వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసలో 'ఓయు' గుబులు, పరిష్కారం కేసీఆర్ కోర్టులో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం.. తెలంగాణ వచ్చాక, తెలంగాణ కోసం పుట్టుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక కూడా రగులుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర ఎవరు కొట్టి పారేయలేనిది. ఓయు, కేయూల పాత్ర ఎవరు మర్చిపోలేదని.

తెలంగాణ కోసం ఉద్యమించిన ఓయు విద్యార్థులే ఇప్పుడు ఉద్యోగాల కోసం తెరాస ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. తెలంగాణ వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయం కూల్‌గా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, ఓయు ఇంకా రగులుతూనే ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం... హరీష్ రావు, కేటీ రామారావు వంటి నేతలకు రెడ్ కార్పెట్ పరిచిన విద్యార్థులే, ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసన కేవలం ఓయుకే పరిమితం కాలేదు. రంగారెడ్డి జిల్లా పరిగిలోని మంగళవారం విద్యార్థులు రోడ్డెక్కారు.

కేసీఆర్

కేసీఆర్

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన విద్యార్థులకు ఆగ్రహం తెప్పించింది. కేసీఆర్ దిష్టిబొమ్మలను ఓయులో తగులబెట్టారు. మంత్రులను అడ్డుకున్నారు.

ప్రతిపక్షాలు

ప్రతిపక్షాలు

ఓయు విద్యార్థుల నిరసన పైన రాజకీయ పార్టీలు ఒకింత డైలమాలోనే ఉన్నాయని చెప్పవచ్చు. విద్యార్థుల నిరసనలో న్యాయం ఉందని చెప్పిన కాంగ్రెసు పార్టీ.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అవుతున్నందున విద్యార్థుల నిరసనకు తాము మద్దతు తెలపడం లేదని, దానికి క్షమించాలని కోరింది.

ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా యూనివర్సిటీ

తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు లాఠీదెబ్బలు తిన్నారు. ఉద్యోగాలు తగ్గుతాయనే ఆందోళనతో ఇప్పుడు సొంత ప్రభుత్వం పైనే నిరసనలు వ్యక్తం చేసి దెబ్బలు తింటున్నారు.

ఉస్మానియా

ఉస్మానియా

సమస్యకు ఓ పరిష్కారం కనుక్కోవాలని వారు ఆయనను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ వేదికగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తమ ప్రభుత్వం పైన అసంతృప్తి రాజుకుంటే అది తమకే మంచిది కాదని తెరాసకు చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విద్యార్థులు లాఠీఛార్జీ దెబ్బలు తిన్నారు. పోలీసులు వారి పైన బాష్పవాయు ప్రయోగాలు చేశారు. అంతేకాదు విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తెలంగాణ కోసం పోరు సమయంలో ఉస్మానియా ఇలా...

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విద్యార్థులు లాఠీఛార్జీ దెబ్బలు తిన్నారు. పోలీసులు వారి పైన బాష్పవాయు ప్రయోగాలు చేశారు. అంతేకాదు విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్య కూడా చేసుకున్నారు.'

మంత్రులకు సెగ

మంత్రులకు సెగ

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు తదితరులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ ఏకంగా కార్యక్రమాన్నే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇది క్రమంగా తెలంగాణవ్యాప్తం అవుతుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. విద్యార్థులకు ప్రతిపక్షాలు మద్దతు పలికితే అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని పలువురు మంత్రులు, సీనియర్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారట. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కోవాలని వారు ఆయనను కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ వేదికగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే తమ ప్రభుత్వం పైన అసంతృప్తి రాజుకుంటే అది తమకే మంచిది కాదని తెరాసకు చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను పట్టించుకోలేదనే విమర్శలు ప్రతిపక్షాల నుండి ఎదురు కావొచ్చునని భావిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెసు పార్టీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. విద్యార్థుల అరెస్టును, లాఠీఛార్జీని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం దెబ్బలు తింటున్నారనే విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు అంటున్నారు.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి ఓయునే ముఖ్య వేదిక అంటున్నారు. 2009 అనంతరం ప్రారంభమైన ఉద్యమంలోను ఓయు, కేయు పాత్రలు ఎనలేనివని, తెలంగాణ ఉద్యమం బలంగా మారడానికి కారణం విద్యార్థులేనని, ముఖ్యంగా ఓయు, కేయు విద్యార్థులని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం రాజకీయంగా, రాజకీయాలకు అతీతంగా ఊపు అందుకోవడానికి కారణం విద్యార్థులేనని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ వచ్చాక అదే విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వం నిప్పులు చెరగడం, కేసీఆర్ వంటి నేతల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇది తెరాస ప్రభుత్వానికి మంచిది కాదని, సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని విపక్షాలు హితవు పలుకుతున్నాయి. కాగా, ఇది రాజకీయ నిరసనలు అనే వారు కూడా లేకపోలేదు. కాగా, కేసీఆర్ ఇటు విద్యార్థులను, అటు కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లబరిచే అంశంపై దృష్టి సారించారట.

English summary

 Some ministers took up the issue of regularising contract workers in Telangana with Chief Minister K Chandrasekhar Rao and urged him to find an amicable solution to this issue. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X