ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ సమక్షంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చేరిక(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా సోమవారం, కాంగ్రెస్‌ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనుకయ్య, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, డాక్టర్‌ రాజేశ్వరరావు, వెంకట్‌రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నాయకురాలు లక్ష్మి తమ అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వారికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

బంగారు తెలంగాణ సాకారం కావడానికి టిఆర్‌ఎస్‌ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కెసిఆర్‌ పునరుద్ఘాటించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, వైయస్సార్ కాంగ్రెస్‌తో పాటు టిడిపి నేతలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు ప్రకటించారు. వీరిలో మార్కెట్‌ కమిటీల సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని, 1200 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలున్నారని వివరించారు. పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే రథసారథులని అన్నారు.

హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సిఎం కెసిఆర్‌కు అందరూ చేయూత నివ్వాలని, అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదులు టిఆర్‌ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. తాజా చేరికలతో ఖమ్మం జిల్లాలో టిడిపి ఖతం అయ్యిందని అన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు. బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గవర్నర్‌పాలన ఉండాలని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

టిఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ గౌరవాన్ని పెంచే పార్టీ అని డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ అన్నారు.జగ్గారెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేకికి బిజెపి టికెట్‌ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, చీఫ్‌ విప్‌ ఓదెలు, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమారం సత్యనారాయణ, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సలీం, వెంకట్‌రావు, ఆమోస్‌, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

చేరికలు

చేరికలు

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి వలసల పరంపర కొనసాగుతోంది.

చేరికలు

చేరికలు

తాజాగా సోమవారం, కాంగ్రెస్‌ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనుకయ్య, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, డాక్టర్‌ రాజేశ్వరరావు, వెంకట్‌రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నాయకురాలు లక్ష్మి తమ అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

చేరికలు

చేరికలు

టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వారికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

చేరికలు

చేరికలు

బంగారు తెలంగాణ సాకారం కావడానికి టిఆర్‌ఎస్‌ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కెసిఆర్‌ పునరుద్ఘాటించారు.

చేరికలు

చేరికలు

అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, వైయస్సార్ కాంగ్రెస్‌తో పాటు టిడిపి నేతలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు ప్రకటించారు.

చేరికలు

చేరికలు

వీరిలో మార్కెట్‌ కమిటీల సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని, 1200 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలున్నారని వివరించారు.

చేరికలు

చేరికలు

పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే రథసారథులని అన్నారు.

చేరికలు

చేరికలు

హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సిఎం కెసిఆర్‌కు అందరూ చేయూత నివ్వాలని, అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదులు టిఆర్‌ఎస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు.

చేరికలు

చేరికలు

తాజా చేరికలతో ఖమ్మం జిల్లాలో టిడిపి ఖతం అయ్యిందని అన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు.

చేరికలు

చేరికలు

బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గవర్నర్‌పాలన ఉండాలని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

చేరికలు

చేరికలు

టిఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ గౌరవాన్ని పెంచే పార్టీ అని డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ అన్నారు.జగ్గారెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేకికి బిజెపి టికెట్‌ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.

English summary
After suffering a setback in the Legislative Assembly elections in May, the woes of Congress are continuing in Telangana with some of its legislators joining the ruling TRS on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X