రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్లంగౌడ్ పనే: కానిస్టేబుల్ మృతి, ఎస్సైకి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy
హైదరాబాద్: పోలీసులకు, ఆగంతకులకు మధ్య శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్సై గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట సమీపంలోని మజీద్‌పురా వద్ద సంఘటన చోటు చేసుకుంది. నలుగురు ముఠా సభ్యులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ఆగంతకులు జరపడంతో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. ఎస్సై వెంకట్ రెడ్డి గాయపడ్డాడు.

పోలీసులు ఎదురు కాల్పులు జరిపాడు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఆగంతకుడు కూడా మృతి చెందాడు. మజీద్‌పురా గ్రామం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన ఆగంతకులు కత్తులతో దాడిచేశారు.

పోలీసులు జరిపిన కాల్పుల్లో 35 ఏళ్ల ఆగంతకుడు మరణించాడు. మిగిలిన ముగ్గురు పారిపోయారు. పారిపోయిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైబరాబాద్, మెదక్ జిల్లాలో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు

ఆగంతకుల నుంచి లక్షన్నర రూపాయల విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నించామని, పారిపోయినవారి కోసం గాలిస్తున్నామని జాయింట్ సిపి గంగాధర్ చెప్పారు.

నేరస్థులను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈశ్వరయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈశ్వరయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఓదార్చారు. శామిర్‌ుేచ ఘటన తమకో పాఠమని ఆయన చెప్పారు. పోలీసులకు ఆధునిక ఆయుధాలు ఇస్తామని చెప్పారు. ఎస్సై చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెప్పారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన పోలీసులను ఆయన పరామర్శించారు.

పోలీసుల అదుపులో ఇద్దరు

పోలీసులపై శుక్రవారం అర్థరాత్రి దాడి చేసిన నలుగురు ముఠా సభ్యుల్లో ఎల్లంగౌడ్ అనుచరుడు ముస్తఫా మరణించాడు. సిద్ధిపేటకు చెందిన ఎల్లంగౌడ్ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ నోట్ల చెలామణిలో ఈ ముఠా పనిచేస్తోంది. రఘు, నందు అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. ఎల్లంగౌడ్, శ్రీకాంత్ కోసం గాలిస్తున్నట్లు, నాలుగు బృందాలు వారి కోసం వేట సాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో ఈ ముఠాపై పలు కేసులున్నాయి. ముఠా దాడిలో మరణించిన ఈశ్వరయ్య మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థలానికి పంపిస్తామని ఆయన చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను ఆయన పరామర్శించారు.

English summary
An identified gang has attacked police at Shameerpet in Ranga Reddy district, in which constable Eshwaraiah died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X