వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు అకాడమీలో జాషువాకు నివాళులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దళితులు ఆవేదనలను, ఆక్రోశాలను తన రచనల ద్వారా లోకానికి తెలియచేసిన మహా కవి జాషువా అంటూ వక్తలు నివాళి అర్పించారు. పద్మభూషణ్‌ డాక్టర్‌ గుర్రం జాషువా 119వ జయంతి సభను సోమవారం హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ కార్యాలయంలో నిర్వహించారు.

జాషువా తన రచనల ద్వారా అణచివేతకు గురైన వారిలో ఉద్దీప్తమైన చైతన్యాన్ని కలిగించారని ఆయన అన్నారు. ఫెమినిస్టు సాహిత్యంలో జాషువా రచనలు, ప్రస్థావన లేకపోవడం దురదృష్టకరమని ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర అన్నారు జాషువా లాంటి సాహితీవేత్తలు ప్రాంతాలకతీతంగా అందరికీ కావాలని వక్తలు అన్నారు.

తెలుగు అకాడమీ సంచాలకులు ఎ.సత్యనారాయణరెడ్డి, సాహితీవేత్తలు, అకాడమీ ప్రముఖుడు డాక్టర్‌ బన్న ఐలయ్య, ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌, డాక్టర్‌ ఎం.మాణిక్యలక్ష్మి, డాక్టర్‌ కాలువ మల్లయ్య, విద్వాన్‌ బి.కిరణశ్రీ, లాబన్‌బాబు, డాక్టర్‌ టి.వరప్రసాద్‌, జాషువా జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్‌ కోట శారద, శశీందర్‌రాజు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగించి...

జ్యోతి వెలిగించి...

చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి ప్రముఖ దళిత కవి జాషువాకు నివాళులు అర్పిస్తున్న తెలుగు అకాడమీ డైరెక్టర్ ఎ. సత్యనారాయణ రెడ్డి.

ఇలా నివాళులు...

ఇలా నివాళులు...

తెలుగు అకాడమీ నిర్వహించిన జాషువా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కోవెల సుప్రసన్నాచార్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

గ్రంథాల ఆవిష్కరణ

గ్రంథాల ఆవిష్కరణ

జాషువా సాహిత్యం-మానవతావాదం, జాషువా సాహిత్యం-సామాజిక న్యాయం, జాషువా సాహిత్య సమాలోచనం పుస్తకాలను వక్తలు ఆవిష్కరించారు.

తెలుగు అకాడమీలో బతుకమ్మ

తెలుగు అకాడమీలో బతుకమ్మ

తెలుగు అకాడమీలో మహిళా ఉద్యోగులు సోమవారం బతుకమ్మ ఆట ఆడారు. ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

English summary
Poets and literary personalities paid homage to Dalit poet Jashuva in a meeting held at Telugu Academy in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X