హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ, బాబు పక్కపక్కన, ఊగిపోయిన పవన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పాత విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు సభలో పాల్గొన్నారు!

పదేళ్ల తర్వాత బిజెపి, టిడిపిలు ఒకే వేదిక పైకి వచ్చాయి. గతంలో జట్టు కట్టిన ఈ పార్టీలు ఆ తర్వాత వేరు అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఒక్కటయ్యాయి. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వేదిక పైన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎల్బీ స్టేడియం సభతో పాటు నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభలు విజయవంతం కావడంతో కమలం క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. చంద్రబాబు, మోడీల కంటే పవన్ కళ్యాణ్ తెరాస పైన ఎక్కువగా ఊగిపోయారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

ఒకేరోజు నాలుగు సభలు.. ప్రతిచోటా ఉత్సాహం నింపేలా ప్రసంగం... ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతూ ఉత్తేజం. తెలంగాణలో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పర్యటన సుడిగాలిలా సాగింది.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

హైదరాబాద్ సభలో మొట్టమొదటిసారిగా మోడీ, తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

అంతకుముందు మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో చంద్రబాబు, నిజామాబాద్ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నాలుగు సభలకు బిజెపి, టిడిపి కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

నిజామాబాద్ సభలో, హైదరాబాద్ సభలో పవన్ కళ్యాణ్.. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

హైదరాబాద్ సభలో పవన్ సూటిగా కెసిఆర్‌పై ధ్వజమెత్తారు.'దేశ సమగ్రతను దెబ్బతీసేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

మోడీ ప్రతి సభలో 'భారత్ మాతాకీ జై' అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. పదే పదే సోదర సోదరీ మణులారా అంటూ సంభోదించారు. ప్రజలను భారత భాగ్య విధాతలుగా అభివర్ణించారు.

 మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

ప్రజలే దేవుళ్లు అని నాడు ఎన్టీఆర్ పేర్కొనగా... జనతా జనార్దన్ అని మోడీ ప్రజలను అభివర్ణించారు. పదేపదే తల్లీ కొడుకుల ప్రభుత్వం అంటూ సోనియా, రాహుల్‌లపై మండిపడ్డారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

కెసిఆర్‌ను ప్రత్యక్షంగా విమర్శించనప్పటికీ మామ, మేనల్లుడు, కొడుకు అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. కుటుంబ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి జరగదన్నారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ ప్రసంగాల్లో పూర్తిగా తెలంగాణ, ఉద్యమం, బలిదానాలపై దృష్టి సారించిన మోడీ... హైదరాబాద్‌లో మాత్రం సీమాంధ్ర పేరును కూడా పదేపదే ప్రస్తావించారు.

 మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

నిజామాబాద్‌లో పసుపు రైతుల సమస్యలు, మహబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం, కరీంనగర్ సభలో ఉపాధికోసం గల్ఫ్‌కు వలస పోతున్న అంశాలను ప్రస్తావించారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

సూరత్‌లో మూడు లక్షల మంది తెలంగాణ ప్రజలున్నారని, వారిని సోదరుల్లా చూసుకుంటున్నామని, గుజరాత్ అభివృద్ధి గురించి వారిని అడిగితే చెబుతారన్నారు.

 మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

దివంగత ప్రధానమంత్రి పివి నర్సింహా రావుకు జరిగిన అన్యాయం గురించి అన్ని సభల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. సోనియా కుటుంబం ఆయనను అవమానించిందన్నారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

వచ్చిన జనం మోడీ.. మోడీ... మోడీ అంటూ ఊగిపోయారు. మహబూబ్‌నగర్ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... మోడీ ప్రధాని కావాలనే వారు చప్పట్లతో ఆమోదం తెలపండనగా... సభా ప్రాంగణమంతా కేరింతలు, చప్పట్లతో మార్మోగింది.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

హైదరాబాద్ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరు కావడం బిజెపి, టిడిపి శ్రేణులకు కొత్త ఉత్సాహం నింపింది. తమ పొత్తు క్షేత్రస్థాయిలో మరింత విజయవంతమవుతుందని నేతలు భావిస్తున్నారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

పొత్తు చర్చల్లో చోటుచోసుకున్న చిన్నపాటి విభేదాలు పూర్తిగా సమసిపోయినట్లే అని చెబుతున్నారు. కాగా, పవన్ కల్యాణ్ ట్రాఫిక్‌లో ఇరుక్కోవడంతో ఎల్బీ స్టేడియం సభకు ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.

మోడీ - పవన్ - బాబు

మోడీ - పవన్ - బాబు

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో పాత విభేదాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీలు సభలో పాల్గొన్నారు!

English summary
In a show of unity, Narendra Modi shared the stage with N Chandrababu Naidu, leader of the BJP's latest alliance partner, TDP, and actor-turned-politician Pawan Kalyan at a rally held in Hyderabad this evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X