వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీటు వద్దంటే రూ.లక్ష ఇవ్వాలి, జోక్యం వద్దని టీ చైర్మన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీటు వచ్చినా ఏదో ఒక కారణం చెప్పి తప్పుకోవాలనుకుంటే లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శనివారం ప్రారంభమైన ఎంసెట్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో జరిమానా నిబంధనను కొత్తగా ఈ ఏడాది నుంచి అమలులోకొచ్చేలా విధించారు.

మొదటి కౌన్సెలింగ్‌లో ఒక కాలేజీలో సీటు పొంది, దానిని రెండో విడత కౌన్సెలింగ్‌ పొందిన సీటు కోసం వదులుకుంటే ఈ నిబంధన వర్తించదని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ టి రవిరాజు చెప్పారు. ఐదు కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ సాంకేతిక సమస్యల కారణంగా గంటన్నర అలస్యంగా ప్రారంభమైంది.

EAMCET 2014: MBBS and BDS counselling

కౌన్సెలింగ్‌కు మొదటి ఇద్దరు ర్యాంకర్లు గైర్హాజరయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (హెచ్‌)లో మూడో ర్యాంకర్‌ నుంచి అధికారులు కౌన్సెలింగ్‌ను ఆరంభించారు. మూడో ర్యాంకర్‌ కె పృధ్వీరాజ్‌ జేఎన్‌టీయూ (హెచ్‌)లో నమోదై, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో సీటును పొందారు.

లుగోర్యాంకర్‌ దారపనేని హరిత ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీలో నమోదై గుంటూరు మెడికల్‌ కళాశాలలో సీటును పొందారు. వీరితో పాటు ఐదో ర్యాంకర్‌ వీఎం రెడ్డి ఉస్మానియాలో సీటు పొందారు. ఈ ఏడాది మొదటి పది ర్యాంకర్లలో కేవలం ముగ్గురు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.

కాగా, ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తయిందని, సీట్లు మిగిలాయని, అనుమతిస్తే రెండో విడత కౌన్సెలింగ్ జరుపుతామని తెలంగాణ ఉన్నత విద్యామండలి శాఖ చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం అవసరం లేదని ఆయన అన్నారు.

English summary
EAMCET 2014: MBBS and BDS counselling completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X