వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ఈసి

|
Google Oneindia TeluguNews

EAMCET counselling notification released
హైదరాబాద్: ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి 23 వరకు ధృవ పత్రాలను పరిశీలిస్తారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 34, తెలంగాణలో 23 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొదటి రోజు 1 నుంచి 5వేల ర్యాంకు లోపు వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు 2,15, 336 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

కాగా, ఉన్నత విద్యా మండలి విడుదల చేసే నోటిఫికేషన్‌తో తమకు సంబంధం లేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే 'ఫాస్ట్' పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని నియమించింది. స్థానిక నిర్ధారించే ధృవపత్రాలను రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి 'ఫైనాన్పియల్ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్(ఫాస్ట్)' పేరుతో కొత్త స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిని విషయం తెలిసిందే.

English summary
EAMCET counselling notification released by state higher education council on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X