వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ దంపతులు ఊడ్చారు: కెసిఆర్‌తో.. (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా గవర్నర్ దంపతులు ఇఎస్ఎల్ నరసింహన్, విమలా నర్సింహన్ గురువారంనాడు పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్ భవన్ కాలనీ పరిసరాలను వారు పరిశుభ్రం చేశారు.

గవర్నర్‌ దంపతులతో పాటు పలువురు ఉద్యోగులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. సమీపంలోని పాఠశాలలో కూడా పారిశుద్ధ్యం చేపట్టారు. పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రతా ప్రాధాన్యాన్ని నరసింహన్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు నిత్యం తమ ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఉద్భోధించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి బాపూ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు.

గవర్నర్ ఇలా ఊడ్చారు..

గవర్నర్ ఇలా ఊడ్చారు..

నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తన సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సతీమణితో కలిసి...

సతీమణితో కలిసి...

రాజ్ భవన్ కాలనీలోని పరిసరాలను తన సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి గవర్నర్ నరసింహన్ వీధులను శుభ్రం చేశారు.

చెరో వైపు ఊడుస్తూ...

చెరో వైపు ఊడుస్తూ...

గవర్నర్ దంపతులు చెరో వైపు వీధిని శుభ్రం చేస్తూ కనిపించారు. వారితో పాటు ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీకి నివాళి...

గాంధీకి నివాళి...

గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి బాపూ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.

దత్తాత్రేయ కూడా..

దత్తాత్రేయ కూడా..

బాపూ ఘాట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పూలతో నివాళులు అర్పించారు. గవర్నర్‌తో పాటు బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు.

గవర్నర్ ఇలా..

గవర్నర్ ఇలా..

బాపూ ఘాట్‌పై పూలు ఉంచి, గవర్నర్ నరసింహన్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. కెసిఆర్, దత్తాత్రేయ కూడా ఉన్నారు.

స్పీకర్ కూడా..

స్పీకర్ కూడా..

గవర్నర్, ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూదనచారి, మంత్రి హరీష్ రావు కూడా గాంధీకి నివాళులు అర్పించారు.

English summary
Governor ESL Narasimhan cleaned the surroundings of the Raj Bhavan Colony. Accompanied by several employees, they also cleaned the nearby school responding to the call of Prime Minister Modi's 'Swachh Bharat' programme on Gandhi Jayanthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X