హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైరతాబాద్‌లో గవర్నర్ దంపతుల తొలిపూజ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన 60 అడుగుల కైలాస విశ్వరూప మహా గణనాథుడికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ దంపతులు తొలి పూజ చేయడంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఖైరతాబాద్‌లో సందడి నెలకొంది.

సికింద్రాబాద్‌ ఎంపి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి తొలిపూజలో పాల్గొన్నారు.

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ మాట్లాడుతూ.. ఏ శుభకార్యం చేసినా తొలుత గణనాథుడినే పూజిస్తామని తెలిపారు. గత ఐదేళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలని మహా గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కైలాస విశ్వరూప మహాగణపతి క్యాలెండర్‌ను గవర్నర్ నర్సింహన్ ఆవిష్కరించారు. విగ్రహ శిల్పి రాజేంద్రన్, మహా గణపతి లడ్డూ తయారీదారు మల్లిబాబు ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్‌ను సత్కరించారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన 60 అడుగుల కైలాస విశ్వరూప మహా గణనాథుడికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తొలి పూజ చేశారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

గవర్నర్ దంపతులు తొలి పూజ చేయడంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

సికింద్రాబాద్‌ ఎంపి బండారు దత్తాత్రేయ, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి తొలిపూజలో పాల్గొన్నారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

విగ్రహ శిల్పి రాజేంద్రన్, మహా గణపతి లడ్డూ తయారీదారు మల్లిబాబు ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్‌ను సత్కరించారు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ మాట్లాడుతూ.. ఏ శుభకార్యం చేసినా తొలుత గణనాథుడినే పూజిస్తామని తెలిపారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

గత ఐదేళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి జరగాలని మహా గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఖైరతాబాద్ మహా గణపతి

ఖైరతాబాద్ మహా గణపతి

ఈ సందర్భంగా కైలాస విశ్వరూప మహాగణపతి క్యాలెండర్‌ను గవర్నర్ నర్సింహన్ ఆవిష్కరించారు.

English summary
Governor E.S.L Narasimhan performed Ganesh Pooja at Khairatabad Vinayaka Mandapam, in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X