వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుభవం లేకున్నా ఆలోచన: మంత్రి ఈటెల (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతులకు అనుకూలంగా ప్రభుత్వాలు తీసుకునే మద్దతు ధర వారికి చేరడం లేదని, ప్రభుత్వ నిర్ణయం అమలు కావడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ అన్ారు. రైతులకు రుణమాఫి చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే దానికన్నా ఎక్కువ రావాల్సింది పోయి నానాటికీ ధర తగ్గుతోందని ఆయన అన్నారు. ఆశించిన ఫలితాలు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుకు కనీస మద్దతు ధర ఎంత ఉండాలో నిర్ణయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆచరణ సాధ్యమో అన్వేషించాలని ఆయన జెసిలకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేని రీతిలో తెల్ల రేషన్ కార్డుల తొలగింపు ఉండాలని, దీనికి అనుగుణంగా సరుకుల పంపిణీ, నాణ్యత ఉండేలా చూడాలని ఆయన అన్నారు. తమకు అనుభవం లేకపోయినా ఆలోచన ఉందని, తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత వ్యవసాయం రైతులేనని ఆయన స్పష్టం చేశారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ రైతుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

రైతులకు ప్రభుత్వాలు ప్రకటిస్తున్న మద్దతు ధర రావడం లేదని, దానికన్నా తక్కువ ధర వస్తోందని ఆయన అన్నారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

రైతుల పంటలకు తగిన ధర వచ్చేందుకు ఆచరణాత్మకమైన విధానాన్ని ఆన్వేషించాలని ఈటెల రాజేందర్ జాయింట్ కలెక్టర్లకు సూచించారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

తెల్ల రేషన్ కార్డుల తొలగింపు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండాలని ఆయన జాయింట్ కలెక్టర్లకు సూచించారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

తమకు అనుభవం లేకపోయినా ఆలోచన ఉందని, తమ ప్రథమ ప్రాధాన్యం రైతులకూ వ్యవసాయానికేనని ఈటెల రాజేందర్ అన్నారు.

ఈటెల రాజేందర్ సమీక్ష

ఈటెల రాజేందర్ సమీక్ష

చౌకధరల దుకాణాలకు పంపిణీ చేసే సరుకుల్లో నాణ్యత పాటించాలని, సరుకుల పంపిణీ కూడా సక్రమంగా ఉండాలని ఆయన సూచించారు.

English summary
Telangana Finance minister Etela Rajender said that farmers are not getting remunerative prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X