వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైత్రివనం సవేరా హోటల్‌లో అగ్నిప్రమాదం.. పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్య

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో ఉన్న మైత్రీవనం వద్ద సవేరా హోటల్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదపు వివరాలు తెలియాల్సి ఉంది.

ఏపీ సీఎం సహాయనిధికి విజయ బ్యాంకు విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విజయ బ్యాంక్ రూ. 50 లక్షల విరాళం అందజేసింది. విజయా బ్యాంక్ సీఎండీ కన్నన్, బీఎస్ రామారావులు మంగళవారం రూ. 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

Fire accident at maitrivanam savera hotel

పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి అనుబంధ గ్రామమైన నారాయణరావుపల్లెలో పింఛన్ రాలేదని మనస్తాపంతో చిగురు సంజీవ్ (22) అనే వికలాంగుడు అత్మహత్యకు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సంజీవ్‌కు గత ఎనిమిది సంవత్సరాలుగా వికలాంగుల పింఛన్ వస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం కొత్త జాబితాలో తన పేరు లేకపోవడంతో సంజీవ్ మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. దీంతో కోపద్రిక్తులైన గ్రామస్ధులు దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ముషీరాబాద్‌లో సోదాలు

హైదరాబాద్ దక్షిణ మండలం పరిధిలోని ముషీరాబాద్‌లో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు గాను పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఘర్షణలో వ్యక్తి మృతి

కడపజిల్లా మైలవరం మండలం జి.ఉప్పలపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చింతకాయల శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ గొడవకు కారణం భూవివాదమేనని తెలిసింది.

English summary
Fire accident at maitrivanam savera hotel in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X