విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని జగదాంబ జంక్షన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఓ షాపింగ్ మాల్‌లో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారివైపు ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్‌మాల్ నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

పెద్దగా కేకలు వేయడంతో షాపింగ్ మాల్‌లోని సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోర్డు కాలిపోవడం మినహా ఎటువంటి నష్టం జరగలేదు. షాపింగ్ మాల్ లోపలికి మంటలు ప్రవేశించి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేందని, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగి ఉండేదని స్థానికులు చెప్పారు.

అగ్ని ప్రామదం

అగ్ని ప్రామదం

షాపింగ్ మాల్‌లో చోటు చేసుకన్న అగ్ని ప్రమాద ఘటన వివరాలు మీడియాకు తెలుపుతున్న పోలీసులు.

భారీగా చేరుకున్న జనం

భారీగా చేరుకున్న జనం

నగరంలోని జగదాంబ జంక్షన్‌లో పెను ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్ మాల్‌లో శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

లక్కీ షాపింగ్ మాల్

లక్కీ షాపింగ్ మాల్

ప్రధాన రహదారివైపు ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్‌మాల్ నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఘటనా స్థలంలో జనం

ఘటనా స్థలంలో జనం

దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేయడంతో షాపింగ్ మాల్‌లోని సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

షాపింగ్ మాల్

షాపింగ్ మాల్

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోర్డు కాలిపోవడం మినహా ఎటువంటి నష్టం జరగలేదు.

English summary
Huge fire accident took place at Lucky shopping mall at Jagadamba center in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X