విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు 50లక్షల టోకరా: జంట పరారీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సింగపూర్‌లో ఉద్యోగం.. లక్షల్లో జీతం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించింది ఓ జంట. సుమారు రూ.50 లక్షల వరకూ వసూలుచేసి గుట్టుచప్పుడు కాకుండా వుడాయించింది. దీంతో న్యాయం చేయాలని కోరుతూ బాధితులు బుధవారం విశాఖపట్నం 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే.. మల్లాప్రగడ గౌతమ్‌ ఈశ్వరరావు, అతని భార్య స్వాతిప్రియారావు నిరుడు జులైలో లాసెన్స్‌బే కాలనీలోని సాయిరాఘవ అపార్టుమెంట్‌లో అద్దెకు దిగారు.

తనకు ఢిల్లీ, భువనేశ్వర్‌, సింగపూర్‌లలో కన్సల్టెన్సీ బ్రాంచీలు వున్నాయని, నగరంలో కూడా కొత్తగా ఒక బ్రాంచీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చుట్టుపక్కలవారికి ఈశ్వరరావు వివరించాడు. ఇంజనీరింగ్‌ చదువుకున్నవారికి సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పించగలనని, ఇప్పటికే ఎంతోమందికి ఇప్పించానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈశ్వరరావు మాటలు నౄమ్మిన చుట్టుపక్కల వుంటున్న సుమారు 40 మంది నిరుద్యోగులు అతని వద్ద చేరారు. వారందరికీ తన ఇంట్లోనే నెల రోజులపాటు శిక్షణ ప్రారంభించాడు.

అక్కడ స్థలం సరిపోదంటూ దొండపర్తిలో కందర్ప కాంప్లెక్స్‌లో దిగ్రేట్‌ మాస్టర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ పేరిట కన్సల్టెన్సీని ఏర్పాటుచేశాడు. దీంతో ఇంజనీరింగ్‌ పూర్తి చేసినవారితోపాటు చదువుతున్నవారు మరికొందరు చేరారు. ఉద్యోగానికి ఎంపికయ్యేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు నాలుగు నెలలపాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలంటూ ఒక్కొక్కరి వద్ద రూ. 25 వేల నుంచి రూ. 60 వేల చొప్పున వసూలుచేశాడు. ఇలా శిక్షణ పొందినవారు ఉద్యోగం వచ్చే వరకూ తన సంస్థలోనే పని చేయవచ్చునని, ఇందుకు నెలకు రూ.10 నుంచి రూ.15 వేలు వరకూ వేతనం ఇస్తానని నమ్మించాడు.

వీరిందరికీ రెండు నెలల వేతనాలను ఈనెల 26,28 తేదీల్లో చెల్లుబాటు అయ్యేలా చెక్‌లను గత నెలలోనే ఇచ్చాడు. ఇక సింగపూర్‌లో వున్న తన బ్రాంచీ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వేయించేస్తానని చెప్పి కొంతమంది వద్ద రూ.1.5 లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకూ వసూలు చేశాడు. మిగిలిన వారిని నమ్మించేందుకు తన వద్ద శిక్షణ పొందుతున్న మనోజ్‌ అనే యువకుడిని సింగపూర్‌ తీసుకువెళ్లి వివిధ చోట్ల తిప్పి తనతో ఒప్పందం వున్న సంస్థలంటూ కొన్నింటిని చూపించాడు.

నిరుద్యోగులకు టోకరా

నిరుద్యోగులకు టోకరా

సింగపూర్‌లో ఉద్యోగం.. లక్షల్లో జీతం ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించింది ఓ జంట. సుమారు రూ.50 లక్షల వరకూ వసూలుచేసి గుట్టుచప్పుడు కాకుండా వుడాయించింది.

నిరుద్యోగులకు టోకరా

నిరుద్యోగులకు టోకరా

దీంతో న్యాయం చేయాలని కోరుతూ బాధితులు బుధవారం విశాఖపట్నం 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

నిరుద్యోగులకు టోకరా

నిరుద్యోగులకు టోకరా

మల్లాప్రగడ గౌతమ్‌ ఈశ్వరరావు, అతని భార్య స్వాతిప్రియారావు నిరుడు జులైలో లాసెన్స్‌బే కాలనీలోని సాయిరాఘవ అపార్టుమెంట్‌లో అద్దెకు దిగారు.

నిరుద్యోగులకు టోకరా

నిరుద్యోగులకు టోకరా

తనకు ఢిల్లీ, భువనేశ్వర్‌, సింగపూర్‌లలో కన్సల్టెన్సీ బ్రాంచీలు వున్నాయని, నగరంలో కూడా కొత్తగా ఒక బ్రాంచీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చుట్టుపక్కలవారికి ఈశ్వరరావు వివరించాడు.

నిరుద్యోగులకు టోకరా

నిరుద్యోగులకు టోకరా

ఇలా అందరినీ నమ్మించి, వారి నుంచి వివిధ రూపాల్లో రూ. 50 లక్షల వరకూ వసూలుచేసిన ఈశ్వరరావు, అతని భార్య జులై 26 నుంచి కనిపించడం లేదు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ డిఎస్‌ఆర్‌ విఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

దీంతో అందరికీ నమ్మకం కుదరడంతో ఉద్యోగం వస్తుందనే ఆశతో ఆభరణాలను తాకట్టుపెట్టి కొందరు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న మొత్తాన్ని మరికొందరు ఈశ్వరరావుకు చెల్లించారు. తమసంస్థలో చేరిన కొంతమంది నిరుద్యోగులను తన వద్ద ఇన్వెస్ట్‌ చేస్తే కేవలం 60 రోజుల్లో రెట్టింపు మొత్తాన్ని ఇస్తానంటూ ఆశ చూపించాడు. మొదట్లో కట్టినవారికి రెట్టింపు మొత్తాన్ని ఇవ్వడంతో నిజమేనని నమ్మిన కొంతమంది ఎక్కువ మొత్తంలో అతని వద్ద డిపాజిట్‌ చేశారు. ఇలా అందరి నుంచి వివిధ రూపాల్లో రూ. 50 లక్షల వరకూ వసూలుచేసిన ఈశ్వరరావు, అతని భార్య జులై 26 నుంచి కనిపించడం లేదు.

ఈశ్వరరావు ఇచ్చిన చెక్‌లన్నీ బౌన్సు కావడం, ఈశ్వరరావు సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో వుండడంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు సంస్థ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పిఎల్‌ లలిత్యను నిలదీశారు. తాను కూడా మోసపోయానంటూ ఆమె సమాధానం చెప్పడంతో బాధితులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదుచేసిన వారిలో నగరానికి చెందిన అలేఖ్య, చైతన్య, నారాయణరావు, షరీఫ్‌, నందిని తదితరులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ డిఎస్‌ఆర్‌ విఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.

English summary
Fraud committed by a job consultancy firm called Great Masters Consultancy came to light here today, after around 60 youth were allegedly duped by it, of nearly Rs 50 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X