వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: గ్యాస్ పైప్‌లైన్ పేలి 15 మంది సజీవదహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajamundry
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓఎన్‌జీసీ గ్యాస్ కనెక్టింగ్ స్టేషన్ సమీపంలోని గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలడంతో మంటల్లో చిక్కుకుని 15 మంది సజీవదహనమైనట్లు తెలియవస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. 11 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మంటలు కిలోమీటర్ ఎత్తులో భారీగా ఎగసి పడుతున్నాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. స్థానికులు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికారులు ఆలస్యంగా రావడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మంటలకు సమీపంలో ఉన్న ఇళ్లు, దుకాణాలు, కొబ్బరి తోటలు కూడా దగ్ధమయ్యాయి. 1994లో ఇలాంటి సంఘటనే జరిగింది. దాదాపు 250 మీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. బ్లోఅవుట్ మాదిరిగా భారీ శబ్దాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాంతో పరుగులు తీశారు. బ్లోఅవుట్ మాదిరిగా పెద్ద శబ్దాలు వచ్చాయి.

అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ఇంట్లో నివసిస్తున్నవారంతా సజీవ దహమయ్యారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. 2010 రాజమండ్రి రిఫైనరీలో ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప సంఘటనా స్థలానికి బయలుదేరారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సంఘటనపై విచారణ జరిపిస్తామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు చేట్టినట్లు గెయిల్ చైర్మన్ త్రిపాఠీ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియదని ఆయన అన్నారు.

English summary
Seven dead due to the blast of ONGC pipeline at Nagaram village in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X