నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టాలపై ఎర్రజెండా, నిలిచిన రైలు: గేట్‌మెన్ మొద్దునిద్ర

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా రైల్వే సిబ్బంది ఇంకా నిద్రమత్తు వదలడం లేదు. నిజామాబాద్ జిల్లాలోని మోషంపూర్‌లో మరో ప్రాణాంతక నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

గేట్‌మెన్ సంతోష్ మద్యం సేవించి పట్టాలపై ఎర్రజెండా కట్టి నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సికింద్రాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలపై ఎర్రజెండా చూసి ఏదైనా ప్రమాదం ఉందేమోనని రైలు డ్రైవర్ రైలును నిలిపివేశాడు.

Gateman plants red flag on tracks, goes into sleep

హఠాత్తుగా రైలు ఆగడంతో రైలులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత ట్రైన్‌గార్డు నిద్రపోతున్న గేట్‌మెన్‌ను లేపి పట్టాలపై నుంచి ఎర్రజెండాను తొలగించారు.

గేట్‌మెన్ నిర్లక్ష్యంతో గతంలోనూ ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన దక్షిణమధ్య రైల్వే సిపిఆర్ఓ సాంబశివ రావు దీనిపై విచారణ జరిపి గేట్‌మెన్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
We have seen several alert gangmen and linemen who have averted major train accidents in the recent past. But this lineman at Moshampur of Sadasivanagar mandal appears to have been made of different stuff. He planted a red flag at the level crossing and went into deep slumber.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X