విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిడ్డే మీల్స్‌పై పడిన గంటా: తిని చూసి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లలకు వండిపెడుతున్న ఆహార పదార్థాలను రుచి చూస్తూ వాటి నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇదేమిటంటూ పెదవి విరుస్తున్నారు. తాజాగా మంగళవారంనాడు ఆయన డాబా గార్డెన్స్‌లోని మహాత్మా గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

అక్కడ మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. నాందీ ఫౌండేషన్ సరఫరా చేస్తున్న భోజనం తినేందుకు బాగా లేదని అన్నారు. మెనూ అమలు తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నిసార్లు గుడ్డు పెడుతున్నదీ అడిగారు. విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రుచి చూశారు. నాణ్యత లేదని అన్నారు.

మధ్యాహ్న భోజనం పథకం నుంచి నాందీ ఫౌండేషన్‌ను తొలగించి, ఆ స్థానంలో అక్షయపాత్రకు లేదా స్యయం సహాయక సంఘాలకు స్థానం కల్పించాలని ఆదేశించారు. రూ. 6లక్షలకే లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతోనే ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన సూచించారు.

గంటా తనిఖీ

గంటా తనిఖీ

పాఠశాలలో 430 మంది విద్యార్థులు ఉంటే 130 మంది మాత్రమే భోజనం చేస్తున్నారంటే ఆహారంలో లోపమే కారణమని గంటా అన్నారు.

గంటా తనిఖీ

గంటా తనిఖీ

రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే కృషికి క్షేత్రస్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరువంటివి ప్రధాన ఆటంకాలుగా మారుతన్నాయని గంటా శ్రీనివాస రావు అన్నారు.

గంటా తనిఖీ

గంటా తనిఖీ

లోపాలను సరిదిద్దడంపై ప్రధాన దృష్టి పెట్టాలని గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

గంటా తనిఖీ

గంటా తనిఖీ

మధ్యాహ్న భోజనం పథకం అమలుపై, ఇతర సదుపాయాలపై డిఇవో నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని గంటా శ్రీనివాస రావు చెప్పారు.

English summary
Andhra Pradesh human resources minister expressed dissatisfaction over mid day meals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X