హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే: వంద శాతం కోసం వారం గడువు, కేంద్రం జోక్యం..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

GHMC to seek week time to Samagra Survey
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇంకా చాలా ఇళ్లలో సర్వే పూర్తి చేయాల్సి ఉందని నగర కమిషనర్ సోమేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ప్రస్తుతం 19 లక్షల 53వేల కుటుంబాల సమగ్ర సర్వే పూర్తయిందని చెప్పారు.

21 లక్షల కుటుంబాలు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించామని, వారికోసం ఇప్పటికే సర్వే స్టేషనరీ ముద్రించామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో వంద శాతం సర్వేకోసం ప్రభుత్వాన్ని వారం రోజుల గడువు కోరనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో ఉదయం వరకు సర్వే కొనసాగిందన్నారు. జీహెచ్ఎంసీలో సవాల్‌గా స్వీకరించిన సర్వే విజయవంతమైందన్నారు.

సర్వేపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవచ్చు!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విషయమై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పరస్పర వాదోపవాదాలు చోటు చేసుకోవచ్చునని, కేంద్ర హోంశాఖ.. ఈ సర్వేలో జోక్యం చేసుకోవచ్చునని హోంశాఖలోని ఓ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

సర్వే వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై కేంద్రం దృష్టి పెట్టిందని ఆ అధికారి చెప్పారట. తగిన సమయంలో తగిన విధంగా హోంశాఖ జోక్యం చేసుకుంటుందని, మంచి నిర్ణయాలే తీసుకుంటారని, ఉద్రిక్తతలను పెంచే పనేమీ తెలంగాణ ప్రభుత్వం చేయదని ఆశిస్తున్నామని చెప్పారట.

English summary
Greater Hyderabad Municipal Carporation Hyderabad to seek week time to Samagra Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X