ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారం రోజులుగా బాలికపై రేప్, బ్యాంక్ దోపిడీకి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl raped in Adilabad district
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ధని గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు వారం రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. స్థానిక ఎస్సీ కాలనీలో ఉండే శ్రీకాంత్ (20) ్నే యువకుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్లి ప్రతి రోజూ అత్యాచారం చేస్తున్నాడు.

ఆ విషయాన్ని గమనించిన బాలిక తండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. నిర్మల్ గ్రామీణ సిఐ రఘు, ఎస్సై రమేష్ విచారణ చేపట్టారు.

ఇదిలావుంటే, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ పద్మశ్రీ వేధింపులు భరించలేక ఓ అంగన్‌వాడీ టీచర్ శంకరమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం రాళ్లపేటలో జరిగింది. టీచర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం

రంగారెడ్డి జిల్లాలోని బషీరాబాద్ మండలం కేంద్రంలో ఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. ఓ దొంగ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు. స్ట్రాంగ్ రూం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగాడు. బ్యాంక్ అధికారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A 6 year lod girl has been repeatedly raped by a 20 years old youth in Adilabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X