వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారాలు: కెసిఆర్‌కు జానా సపోర్ట్, పొన్నాల ప్రశ్నలు

|
Google Oneindia TeluguNews

Governor authorities on Hyderabad: Jana Reddy supports KCR
హైదరాబాద్: గవర్నర్‌కు అధికారాలు ఇచ్చే విషయంపై ఆగస్టు 18న కేంద్రం స్పష్టత ఇచ్చిన తర్వాత తమ వైఖరి చెబుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ఆటంకం కలగకుండా కేంద్రం చూడాలని సూచించారు.

రైతు రాణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయమన్నారు. నెలరోజుల్లోగా రైతు రుణాలను చెల్లించాలని కోరారు. వ్యవసాయానికి 7 గంటలపాటు నిరంతర విద్యుత్ ఇవ్వాలని జానా రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కెసిఆర్‌కు పొన్నాల ప్రశ్నలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 28 ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. ఈ సందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం 70 రోజుల పాలన వైఫల్యాలను లేఖలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.

ఒక్క రోజులో సమగ్ర సర్వే ఎలా సాధ్యమని పొన్నాల ప్రశ్నించారు. సమగ్ర సర్వే ఒక హంగామా అని, అందరూ ఒకే రోజు ఇంట్లో ఉండాలనేది సాధ్యం కాదని తెలిసీ... దానికి ప్రత్యామ్నాయం ప్రకటించకుండా ఒకే రోజు సర్వే అనడం చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఈ ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించవా? అని పొన్నాల ప్రశ్నించారు. మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు.

English summary

 Congress senior leader Jana Reddy on Wednesday said that they will support CM K Chandrasekhar Rao on issue of Governor authorities on Hyderabad. And TPCC president Ponnala Laxmaiah sent a letter to KCR, with 28 questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X