వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడుకొని వదిలేయడమే: బాబును ఏకిపారేసిన హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిల పొత్తుపై తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం నిప్పులు చెరిగారు. దేశం కోసం బిజెపితో పొత్తు అని చంద్రబాబు అనడం విడ్డూరమన్నారు. బిజెపితో పొత్తు టిడిపికి అవసరమా లేక దేశానికి అవసరమా చెప్పాలన్నారు. బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో వెళ్లడం సరికాదన్నారు. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకమన్నారు.

మామ ఎన్టీఆర్ దగ్గరకు తీస్తే ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నారని, ఆ తర్వాత వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారని, వారిని పక్కన పెట్టి 1999లో బిజెపితో కలిసి వెళ్లారని, అనంతరం బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని చెప్పి తెరాస, లెఫ్ట్ పార్టీలతో కలిశారని, ఇప్పుడు మళ్లీ బిజెపితో వెళ్తున్నారని, ఆయన వాడుకొని వదిలేసే రకమన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా బాబును కాపాడటం భూమండలంలో ఎవరికి సాధ్యం కాదన్నారు.

Harish Rao angry for BJP-TDP tie up

బిజెపి, టిడిపి పొత్తు ఆత్మహత్యా సదృశ్యమే అన్నారు. ఎన్నోసార్లు ఇచ్చిన మాటను తప్పిన బాబు మాట ఎవరు నమ్ముతారన్నారు. బాబులా మాట మార్చే వారు ప్రపంచంలోనే లేరన్నారు. తెలంగాణను అడ్డుకున్న టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకోవడంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బాబు డిమాండ్లకు బిజెపి ఆమోదించిందా చెప్పాలన్నారు. అదే నిజమైతే తెలంగాణకు బిజెపి కూడా మోసం చేసినట్లే అవుతుందన్నారు.

తెలంగాణ కోసం పోరాడిన కిషన్ రెడ్డిని, అడ్డుకున్న చంద్రబాబును ఒకే వేదిక పైన ఎలా చూడగల్గుతామన్నారు. టిడిపి తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. మోడీని అడ్డుపెట్టుకొని చంద్రబాబు గెలవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే 18 శాతం ఓట్లు వచ్చాయని, టిడిపితో కలిశాక 3 శాతం మాత్రమే వచ్చాయన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి రావడం ఖాయమన్నారు.

చంద్రబాబు స్వయం ప్రకాశం లేని చంద్రుడు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేశారా చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కేబినెట్‌ను అలీబాబా నలభై దొంగలు అని ఇప్పుడు వారిని ఎలా చేర్చుకుంటారన్నారు. బాబు పక్కా అవకాశవాది అన్నారు. మాట తప్పడంలో చంద్రబాబును మించిన నేత లేడన్నారు.

English summary
Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao has blamed BJP tie up with Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X