వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంబర్ ప్లేట్లు: టీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాహనాల నంబర్ ప్టేట్ల మార్పుపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసింది. తెలంగాణలో నంబర్ ప్లేట్ల రీజ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. తమ అనుమతి లేకుండా ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విచారణ సందర్భంగా హైకోర్టు బెంచ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖలకు పలు ప్రశ్నలు సంధించింది. రిజిస్ట్రేషన్ల పేర పౌరులను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. చట్టాన్ని రూపొందించకుండా పాత రిజిస్ట్రేషన్లు ఎలా మారుస్తారని హైకోర్టు అడిగింది. అధికారం ఉంది కదా అని ఏమైనా చేయాలనుకుంటే సమంజసం కాదని వ్యాఖ్యానించింది.

 High Court expresses anguish at Telangana government

ఢిల్లీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు మెట్రో రైలు ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, మెట్రో నిపుణుడు శ్రీధరన్‌లతో వారు చర్చిస్తారు.

మెట్రో రైలుకు సంబంధించిన భూబదలాయింపు వ్యవహారంలో తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో రైలు వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్ శర్మ, పాపారావు ఢిల్లీ వెళ్లారు.

English summary
High Court expressed anguish at Telangana government on number plates change of vehicless in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X