వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: వాహనాలపై నో టాక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

 High Court orders not collect tax on vehicles
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలపై పన్ను విధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే సరుకు, ఇతర రవాణా వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వచ్చే ఏడాది మార్చి వరకు ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలపై పన్ను వసూలు చేయకూడదని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే ఇరు రాష్ట్రాల్లో తిరగడానికి వాహనాలకు అనుమతి ఇస్తూ గవర్నర్ జూన్ 1వ తేదీన 43వ నెంబర్ జీవో జారీ చేశారు.

ఆ జీవోను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం 586 నెంబర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్‌ను జారీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలును ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ తిరుమల క్యాబ్స్ అసోసియేషన్ హైకోర్టుకు ఎక్కింది.

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాల మధ్య వాహనాలు తిరగడానికి ఒక్క రాష్ట్రంలో పన్ను చెల్లిస్తే చాలునని గవర్నర్ జారీ చేసిన జీవోను సమర్థించింది. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవో నెబంర్ 43కు కట్టుబడి ఉండాలని హైకోర్టు ఆదేశించింది.

English summary
High court ordered Telangana government not to collect tax from vehicles entering from Andhra Pradesh into Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X