హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ తొలి కోత్వాల్‌కు ఘన నివాళి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని నారాయణగుడా వైఎంసిఎ చౌరస్తాలో గల ప్రథమ కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో మార్పులు తెచ్చిన చరిత్ర వెంకట్రామారెడ్డికే దక్కుతుందని మహేందర్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఆడిబ్స్ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ పోలీసు ఇన్‌స్పెక్టర్లు లక్ష్మినారాయణ (చత్రినాక), చంద్రకాంత్ (కూకట్‌పల్లి)లకు మహేందర్ రెడ్డి రాజా బహదూర్ వెంకట్రామారెడ్ిడ, కొండ వెంకట రంగారెడ్డి స్మారక స్వర్ణ పతకాలను, రూ.5వేల నగదు అవార్డులను అందించారు.

అదనపు పోలీసు కమిషన్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్లు వైయ గంగాధర్, బి. మల్లారెడ్డి, కమలహాసన్ రెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఆబిడ్స్ సంక్షేమ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రఘుపతి రెడ్డి, కార్యదర్శి ఎస్‌విఎన్ రెడ్డి, సభ్యుడు మధుసూదర్ రెడ్డి పాల్గొన్నారు.

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి నివాళి

రాజా బహదూర్ వెంకట్రామారెడ్డికి నివాళి

నారాయణగుడాలోని హైదరాబాద్ ప్రథమ కోత్వాల్ రాజ బహదూర్ వెంకట్రామా రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన దృశ్యం.

మహేందర్ రెడ్డి నివాళి

మహేందర్ రెడ్డి నివాళి

నారాయణగుడాలో రాజ బహదూర్ వెంకట్రామారెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

నాయని నర్సింహా రెడ్డి ఇలా..

నాయని నర్సింహా రెడ్డి ఇలా..

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాజా బహదూర్ కోత్వాల్ వెంకట్రామారెడ్డి స్మారకోపన్యాసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి వెంకట్రామారెడ్డికి నివాళులు అర్పించారు.

స్మారకోపన్యాసం...

స్మారకోపన్యాసం...

నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమంలో హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

English summary
Hyderabad kothwal Raja Bahdur VenkataRama Reddy has been remembered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X