వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హుజూర్‌నగర్: ఉత్తమ్‌కు ఎదురీతే, ఇంటిపోరు

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ శాసనసభా స్థానంలో సిట్టింగ్ శాసనసభ్యుడు, తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురీదుతున్నారు. ఆయనకు ప్రత్యర్థుల కన్నా జిల్లా కాంగ్రెసు నాయకుల నుంచే ఎక్కువ వ్యతిరేకత ఎదురువుతోంది. జిల్లాలోని సీనియర్ కాంగ్రెసు నాయకులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మరోవైపు, మట్టంపల్లి మండలంలో స్థాన బలిమి ఉన్న శివారెడ్డి అనే నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు.

తెరాస తరఫున తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున స్వామిగౌడ్ పోటీ చేస్తున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డికి కాంగ్రెసు సీనియర్ నేతలు లోపాయికారిగా సహకారం అందిస్తున్నారు. దీంతో పోటీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, గట్టు శ్రీకాంత్ రెడ్డికి మధ్య ఉండే అవకాశం ఉంది.

Huzurnagar: Uttam kumar Reddy faces tough fight

2009 ఎన్నికల్లో గెలుపొందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరోసారి హుజూర్‌నగర్ నుంచి గట్టెక్కాలనే పట్టుదలతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కీలక బాధ్యతలు లభించే అవకాశం ఉండడంతో ఆయన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. భారీ విజయం సాధించి అధిష్ఠానం దగ్గర తన పట్టునిలుపుకోవాలని భావిస్తున్నారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఉత్తమ్ ఉన్నారు.

కాంగ్రెస్‌పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు, తెలంగాణ సోనియా ఇచ్చిందన్న కృతజ్ఞత తనకు సానుకూలాంశాలని ఆయన చెబుతున్నారు. కృష్ణపట్టె ప్రాంతంలోని తండాల్లో ఓటు బ్యాంకు కూడా తనకు అండగా ఉంటుందని, తాను చేసిన అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలు, మిల్లర్లు, వ్యాపారులు తన వైపే ఉంటారని ఆశిస్తున్నారు. అయితే, తెలంగాణవాదం అంతగా ఈ నియోజకవర్గంలో పనిచేసే అవకాశం లేదు.

ఈ నియోజకవర్గంలో అందరికన్నా ముందుగా ప్రచారరంగంలోకి దిగింది టిడిపి అభ్యర్థి స్వామిగౌడ్.
ఆయన బీసీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా నివాసం ఏర్పరచుకున్న స్వామిగౌడ్ కొంతకాలంగా ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తెరాస అధినేత కెసిఆర్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తెలంగాణ అమర వీరుల కుటుంబం నుంచి కాసోజు శంకరమ్మను హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీకి దించారు. హుజూర్‌నగర్ నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి వైఎస్ సానుభూతి పవనాలపైనే గురి పెట్టారు.

English summary
This time sitting MLA and Telangana PCC president Uttam kUmar Reddy is facing tough fight at Huzurnagar assembly segment in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X