వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాబు వల్లే: అశోక్, తెలుసని

|
Google Oneindia TeluguNews

 Hyderabad brand image brought by Chandrababu: Ashok Babu
విజయవాడ: హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఏపి ఎన్జీవోల నేత అశోక్ బాబు అన్నారు. శనివారం కృష్ణా జిల్లాలోని విజయవాడలో జరిగిన ఏపిఎన్జీవోల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉద్యోగులు సన్మానం చేశారు. చంద్రబాబు నాయుడుతోపాటు ఏపి మంత్రులు కెఈ కష్ణమూర్తి, చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే తెలుగు వారికి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఉద్యోగుల హృదయాల్లో చంద్రబాబుకు ఉన్నత స్థానం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాలు ఉద్యోగులను బయపెట్టేలా ఉండకూడదని కోరారు. ఏపి అభివృద్ధి కోసం ఆదివారాలు కూడా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అశోక్ బాబు తెలిపారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించాలని ఆయన చంద్రబాబును కోరారు. కుటుంబ పెద్దగా ఉద్యోగుల సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్డులను త్వరగా మంజూరుచేయాలని కోరారు. హైదరాబాద్‌లో పని చేయడానికి తాము సిద్ధమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని విడగొట్టారని అన్నారు.

అవినీతిపై చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పని అశోక్ బాబు, ఏసిబికి చిక్కిన చిరుద్యోగుల ఆవేదనను గమనించాలని కోరారు. ఏపిలో పని చేసే తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవని తెప్పారు. ఉద్యోగుల విరమణ వయస్సును 60కి పెంచడం సంతోషకరమని అశోక్ బాబు అన్నారు. ఏపిని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలుసని చెప్పారు. పొరుగుసేవల విధానాన్ని రద్దు చేయాలని చంద్రబాబును ఆయన కోరారు.

English summary
APNGO's leader Ashok Babu on Saturday said that Hyderabad brand image brought by CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X