వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగతాళి చేశారు: చంద్రబాబు, రెచ్చగొట్టొద్దు, కూలీగా..

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విభజన సమయంలో తాను సమన్యాయం అంటే తనను ఎగతాళి చేశారని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నిద్రలేదని చెప్పారు. జీవితంలో ఎన్నడూ బాధపడనంతగా ఆ సమయంలో బాధపడ్డానని అన్నారు. శనివారం విజయవాడలో జరిగిన ఏపిఎన్జీవోల సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగుల చేసిన ఉద్యమం అద్భుతమని అన్నారు. విభజన తర్వాత కోపంతో ఉన్న ప్రజలు ఏం చేస్తారోనని తాను భయపడినట్లు తెలిపారు.

విభజనకు ముందు ఏపిఎన్జీవోల నేత అశోక్ బాబు తనకు తెలియదని, అతను ఉద్యమం నడిపిన తీరు అద్భుతమని చెప్పారు. ఏపి ప్రజలకు అండగా ఉండేందుకే బిజెపితో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలుపులో ఏపిఎన్జీవోల సహాయం కూడా ఉందని తెలిపారు. ఇప్పటికే మూడు శ్వేతపత్రాలు విడుదల చేశాననీ.. మరో మూడు విడుదల చేస్తానని చెప్పారు. కొందరు పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఏపికి న్యాయం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు.

తమ దగ్గర డబ్బుల్లేవని, బడ్జెట్‌లో రూ. 15,600 కోట్ల లోటు ఉందని చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ప్రతి ఓ వ్యక్తి ఒక ఇటుక గానీ , ఇటుక విలువ చేసే ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఏపి అభివృద్ధికి తాను మొదటి కూలీగా పని చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఉద్యమం సమయంలో ఉద్యోగులపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పారు. ఉద్యమ సమయంలోని 80 రోజులను లీవ్‌గా పరిగణిస్తామని చెప్పారు.

I will develop AP as Singapore: Chandrababu

కొందరు విభజన కోరుకుంటే రాష్ట్రం విభజించబడిందని, అది తిరిగి రాదని అన్నారు. ఎప్పటికీ తెలుగుజాతి ఒక్కటేనని అన్నారు. విభజనతో ఏపి అన్ని రకాలుగా నష్టపోయిందని అన్నారు. ఏపికి న్యాయం చేయమనే ఎన్డీఏను కోరుతున్నామని తెలిపారు. ఏపి ప్రజలు విభజన కసితోనే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. తనపై నమ్మకం ఉంచి టిడిపిని గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తామని, సమస్యల్లోనే పరిష్కారం కోసం వెతికే వ్యక్తినని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మరిచిపోలేమని, దాన్నే ముందు తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పారు. ఏపి, టి ప్రజలు విద్వేషాలు కోరువడం లేదని అన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టారు, రెచ్చగొడుతూనే ఉన్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేసేంది తానేనని చెప్పిన ఆయన, ఐటి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. అయితే కొందరు హైదరాబాద్ అభివృద్ధి చేసిన తనను పొగుడ్తున్నారో.. తిడుతున్నారో తెలియడం లేదని అన్నారు. అభివృద్ధి చేయడం వల్లే విభజన కోరుకున్నారని కొందరు అంటున్నారని చెప్పారు.

సిఎం పదవి బంగారు కిరీటం కాదు ముళ్ల కిరీటం అన్నారు. ఏపిలో చాలా సమస్యలున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్, ఫార్మసీలు అడిస్మిషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని టి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్‌లో ఏపివారు ఎవరూ భయపడాల్సిన పనిలేదని అన్నారు. ఎప్పటికైనా తెలుగుజాతి కలవాలని అన్నారు. ఏపిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇండియాలో ఎక్కడా లేని వనరులు ఏపిలో ఉన్నాయని అన్నారు.

ఎక్కువ పోర్టులు, రోడ్లు, దేవలయాలు, పంట భూములు ఏపిలోనే ఉన్నాయని అన్నారు. చదువుకున్న యువత కూడా ఉందని చెప్పారు. 9ఏళ్లలో సైబరాబాద్ ను నిర్మించానని చెప్పిన ఆయన.. ఏపి రాజధాని చూసేందుకు ప్రజలు తరలివచ్చేలా చేద్దామని అన్నారు. కేంద్రం నిధులు, అందరి సహకారంతో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. పదేళ్లలో ఏపిని దేశంలోనే అగ్రరాష్ట్రంగా తయారు చేస్తామని అన్నారు.

త్వరలోనే హెల్త్ కార్డులు అందజేస్తామని చెప్పారు. పిఆర్ సి కూడా అందజేస్తామని చెప్పారు. ఆ ప్రభుత్వం కలిసి వస్తుందో లేదో అని టి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. ఉద్యోగులపై నమోదైన ఏసిబి కేసులను సమీక్షిస్తామని చెప్పారు. అవినీతిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న ఉద్యోగులపై కేసులు నమోదవుతున్నాయే తప్పా.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వారిని ఏం చేయలేకపోతున్నామని అన్నారు. ఏపిలో ప్రతి ఏడాది డిఎస్సీ వేస్తామని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Saturday said that he will develop AP as Singapore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X