వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పిలిస్తేనే కలుస్తా, లేదంటే అంతే: ఎంపీ గీత

By Pratap
|
Google Oneindia TeluguNews

 I will talk with Jagan, if he invites: Geetha
హైదరాబాద్: తనను పిలిస్తేనే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని, తనంత తానుగా కలిసేది లేదని అరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత అన్నారు. సోమవారం సాయంత్రం ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.

తనకు స్థానిక నాయకులతో ఉన్న సమస్యలను ఇది వరకే జగన్‌కు చెప్పానని, అందువల్ల మరోసారి చెప్పాల్సిన అవసరం లేదని, అందువల్ల జగన్ పిలిస్తేనే తాను వెళ్లి కలుస్తానని ఆమె చెప్పారు. తాను సోమవారం హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలిశానని, తిరిగి వెళ్తున్నానని, జగన్ పిలిస్తే ఈసారి వచ్చినప్పుడు ఆయనను కలుస్తానని ఆమె ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.

పార్టీ మారే ఆలోచన తనకు లేదని, అయితే ఆత్మగౌరవం దెబ్బ తింటే తీవ్ర నిర్ణయం తీసుకోక తప్పదని ఆమె అన్నారు. తనకు స్థానిక నాయకులు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన ఆత్మగౌరవం దెబ్బ తింటోందని, వారితో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే జగన్‌కు చెప్పానని ఆమె అన్నారు. జగన్ పిలిసి మాట్లాడడానికి తాను గడువు ఏదీ పెట్టడం లేదని చెప్పారు.

తన అసంతృప్తిని చెప్పానని, తాను శ్రీకాకుళం పర్యటనలో జగన్‌కు తన అసంతృప్తి తెలియజేశానని, అప్పుడు జగన్ తాను చెప్పిందాంట్లో నిజం ఉందని అంగీకరించారని ఆమె అన్నారు. అప్పుడు చెప్పిన తర్వాత చర్యలు తీసుకుంటారని తాను భావించానని, అయితే జగన్ ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని గీత అన్నారు.

తనలాంటి వాళ్లు పార్టీలో చాలా మంది ఉన్నారని, వారు తనను అభినందిస్తున్నారని, మీరు చెప్పారు గానీ మేం చెప్పలేకపోతున్నామని వారన్నారని గీత చెప్పారు. తాను పార్టీ అధ్యక్షుడికి విధేయంగానే ఉన్నానని ఆమె అన్నారు. బిజెపికి, తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని, తాను ఆ పార్టీల్లోకి వెళ్లడం వల్ల ఆ పార్టీలకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని, తమకు కూడా పదవులు వస్తాయని అనుకోవడం లేదని ఆమె అన్నారు.

English summary
YSR Congress party Araku MP Kothapalli Geetha expressed her dissatisfaction over party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X