వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో విల్లంబులు ఎక్కు పెట్టిన స్త్రీలు (పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర స్దాయి ఆర్చరీ (విలు విద్య) ఛాంపియన్‌షిప్‌ విశాఖపట్నంలో జరిగింది. ది ఒలింపిక్ సంఘం విశాఖ, జిల్లా ఆర్చరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఏపీ స్టేట్ సీనియర్స్ తొలి అంతర జిల్లాల ఆర్చరీ పోటీలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు ఆదివారం ప్రారంభించారు.

ఇండియన్ రౌండ్, ఒలింపిక్ రౌండ్లలో విశాఖ క్రీడాకారులు, రికర్వ్, కాంపౌండ్ రౌండ్లలో కృష్ణా జిల్లా జట్లు ప్రతిభ చూపించారు. ఇక మహిళల విభాగంలో తూర్పోగోదావరి, కడప, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వచ్చిన 28 మంది క్రీడాకారిణులు పాల్గొనగా... రికర్వ్ రౌండ్‌లో ఎనిమిది మంది పాల్గొన్నారు.

పురుషుల విభాగంలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల నుంచి ఆర్చర్లు పాల్గొన్నారు. ఎలిమినేషన్‌లో మూడు రౌండ్ల పాటు పోటీలు జరిగాయి. ఒలింపిక్ రౌండ్‌లో ఎలిమినేషన్ పద్దతిలో పురుషుల విభాగంలో సాగిన పోటీల్లో చివరి వరకూ నిలిచిన నలుగురూ విశాఖ క్రీడాకారులే. జాతీయ రికార్డు సాధించిన బైరాగి నాయుడు స్వర్ణాన్ని అందుకోగా రాజబాబు రజతం, రమేష్ కాంస్యం అందుకున్నారు.

ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో విశాఖ సంఘం అధ్యక్షుడు టీఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శి ఎం. శ్యాంబాబు, రాష్ట్ర ఆర్చరీ సంఘం కార్యదర్శి సిహెచ్. సత్యనారాయణ, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

ది ఒలింపిక్ సంఘం విశాఖ, జిల్లా ఆర్చరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఏపీ స్టేట్ సీనియర్స్ తొలి అంతర జిల్లాల ఆర్చరీ పోటీలను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు ఆదివారం ప్రారంభించారు.

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విల్లంబులు ఎక్కు పెట్టిన పురుషులు. పురుషుల విభాగంలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల నుంచి ఆర్చర్లు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

ఎలిమినేషన్‌లో మూడు రౌండ్ల పాటు పోటీలు జరిగాయి. ఒలింపిక్ రౌండ్‌లో ఎలిమినేషన్ పద్దతిలో పురుషుల విభాగంలో సాగిన పోటీల్లో చివరి వరకూ నిలిచిన నలుగురూ విశాఖ క్రీడాకారులే.
విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

జాతీయ రికార్డు సాధించిన బైరాగి నాయుడు స్వర్ణాన్ని అందుకోగా రాజబాబు రజతం, రమేష్ కాంస్యం అందుకున్నారు.

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

ది ఒలింపిక్ సంఘం విశాఖ, జిల్లా ఆర్చరీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఏపీ స్టేట్ సీనియర్స్ తొలి అంతర జిల్లాల ఆర్చరీ పోటీలను ప్రారంభించారు.

 విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

ఏపీ స్టేట్ అంతర జిల్లాల అర్చరీ చాంపియన్‌షిప్‌లో గీతిక, హరిత, వినీల విజేతలుగా నిలిచారు.

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

కాంపౌండ్‌లో గీతిక లక్ష్మి, వై.అనూష, కె.జోత్స్న, ఇండియన్ రౌండ్‌లో జయ వినీల, వర్షాదాస్, వి.గాయత్రి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

విశాఖపట్నంలో రాష్ట్ర స్దాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌

రాష్ట్ర స్దాయి ఆర్చరీ (విలు విద్య) ఛాంపియన్‌షిప్‌ విశాఖపట్నంలో జరిగింది. టార్గెట్‌ను గురి చూస్తున్న ఆర్చర్లు.

English summary

 The first AP State Inter-District Senior Archery Championship was inaugurated by Andhra University Vice-Chancellor G.S.N. Raju at the Golden Jubilee Grounds here on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X