వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాభర్తల మధ్య విడాకుల లాంటిది: విభజనపై కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన విద్వేషాలు పెంచిపోషించాల్సిన అవసరం లేదని, ఇప్పుడు మనం విడాకులు తీసుకున్న జంట స్థితిలో ఉన్నామని, ఈ విద్వేషాలు ఇలా వచ్చి అలా పోయే మేఘాల్లాంటివని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కెటి రామారావు వ్యాఖ్యానించారు. అందరితోనూ స్నేహపూరిత వాతా వరణం ఉండాలనే కోరుకుంటున్నామని తెలిపారు.

పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కూడా ఒకేలా ఉండాలనుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి నుంచి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వివాదం దాకా అడిగిన అనేక అంశాలపై కెటిఆర్ సమాధానమిచ్చారు.

నిరుపేద విద్యార్థులకు లబ్ధి కలిగించే పథకం ఉద్దేశాన్ని నీరుగార్చారని, కొన్ని కాలేజీలు కేవలం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ కోసమే ఏర్పాటు చేశారంటే ఆశ్చర్యం వేస్తుందని కెటిఆర్ వివరించారు. వీటన్నిటికీ చెక్‌ పెట్టాలనుకున్నామని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించటానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

అలాగే ఆరోగ్యశ్రీ వల్ల కూడా కొంత మంది పేదలకు లబ్ధి కలగడం నిజమే అయినప్పటికీ, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు ఇది బంగారు బాతులా మారిందని, ఇవే నిధులను ప్రభుత్వ వైద్యశాలలు, విద్యాసంస్థలను మెరుగుపరచటానికి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నదే తమ భావన అని ఆయన అన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

విజన్ ఫర్ తెలంగాణ పేరిట ఏర్పాటైన మహిళా పారిశ్రామికవేత్తలు వేసిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధానాలు ఇచ్చారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

రాష్ట్ర విభజన నుంచి స్థానికత అంశం వరకు మహిళా పారిశ్రామికవేత్తల నుంచి ప్రశ్నలు వచ్చాయి. వాటికి కెటిఆర్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో తమకు సత్సంబంధాలే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సతీమణి పద్మతో కెటిఆర్ మాట్లాడారు. లగడపాటి ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

స్థానికత అనేది ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు మాత్రమే సంబంధించిందని ఆయన అన్నారు. అమెరికాలో కూడా పౌరులుగా గుర్తించిన తర్వాత కొన్ని పరిమితులు ఉంటాయని ఆయన చెప్పారు.

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలతో కెటిఆర్

మహిళా పారిశ్రామికవేత్తలు కెటిఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటికి కెటిఆర్ నవ్వుతూ సమాధానాలు ఇచ్చారు.

English summary
Telangana IT and panchayatiraj minister KT Rama Rao said that the division of state is like divorce between wife and husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X