వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి: అధిష్టానంపై జానా ఆగ్రహం, చల్లబర్చిన సోనియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Jana Reddy unhappy with High Command
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై మాజీ మంత్రి జానారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ పిసిసి, ఇతర పార్టీ కమిటీల నియామకాలపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో కీలక పదవులకు తనను ఎంపిక చేయకపోవటంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే తన ఆవేదనను బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త దిగ్విజయ్ సింగ్‌ను ఆయన నివాసంలో కలుసుకుని వెళ్లగక్కారు.

దీనిపై డిగ్గీని ప్రశ్నించారట. అధ్యక్షుడిగా పొన్నాల, ప్రచార కమిటీ అధ్యక్షుడిగా దామోదర రాజ నర్సింహ నియామకాలను జానారెడ్డి ప్రశ్నించారని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని తనకంటే జూనియర్లకు కూడా ఉన్నత పదవులు కట్టబెట్టడం, తనకు ఎలాంటి పదవీ లేకుండా చేయటం ఏమిటని నిలదీశారట. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించే ప్రచార కమిటీ చైర్మన్‌ను కూడా నియమించటంతో ఇక తనకు పార్టీ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తోందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తనలాంటి వారినే పక్కనపెడితే ఇక పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలను ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారట. అయితే, జానా రెడ్డిని సముదాయించేందుకు దిగ్విజయ్ అన్ని ప్రయత్నాలూ చేశారు. కానీ, జానా రెడ్డి అలక వీడక పోవటంతో ఆయన్ను తీసుకుని నేరుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు తీసుకు వెళ్లారు. సీనియర్ నేతగా న్యాయం చేస్తామని ఆయనకు సోనియా హామీ ఇచ్చారట.

సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే పిసిసి కమిటీలను నియమించామని, కమిటీల కూర్పు అంతా సామాజిక సమీకరణాల మేరకు చేయాల్సి వచ్చిందని సోనియా వివరించారట. తెలంగాణలో సీనియర్ నేతగా ప్రాధాన్యం తగ్గకుండా చూస్తానని జానాకి సోనియా హామీ ఇచ్చినట్లు సమాచారం.

కాగా, సోనియాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు జానారెడ్డి విముఖత ప్రదర్శించారు. కానీ, దిగ్విజయ్ మాట్లాడారు. జానారెడ్డి వంద శాతం కాంగ్రెస్‌కు విశ్వాసపాత్రుడని, ఆయనకు ఎలాంటి అసంతృప్తీ లేదన్నారు. సోనియాతో భేటీ తర్వాత జానా చల్లబడినట్లుగా తెలుస్తోంది.

English summary
Former Minister Jana Reddy is unhappy with Congress Parties decision on PCC committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X