వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి కారిడార్‌లో మహిళా పిఎస్, కెటిఆర్ ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రజలతో సంబంధాలను నెరపడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు పోలీసులకు సూచించారు. డిజిపి, పోలీసు కమిషనర్లకు తప్పనిసరిగా ట్విట్టర్ ఖాతాలుండాలని, దానివల్ల ప్రజలు నేరుగా వారిని సంప్రదించడానికి వీలవుతుందని ఆయన అన్నారు

హైదరాబాదులోని గచ్చిబౌలి ఐటి కారిడార్‌లో తొలి మహిళా పోలీసు స్టేషన్‌ను కెటిఆర్ ప్రారంభించారు. పోలీసులు చురుగ్గా వ్యవహరించడంతో పాటు నగరంలోని మహిళల భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఆయన అన్నారు.

సమాజంలో మహిళల పట్ల పురుషుల ప్రవర్తన మారాలని, మహిళలను గౌరవించే విధానాన్ని పిల్లలను తయారు చేయాలని ఆయన అన్నారు. ఐటి కారిడార్‌లో భద్రతను పెంచడానికి ఏర్పాటు చేసిన కంపెనీల కూడిన సైబరాబాద్ భద్రతా మండలిలో చేరాలని ఆయన ఐటి కంపెనీలకు సూచించారు.

అయినా తగ్గలేదు...

అయినా తగ్గలేదు...

ఢిల్లీ, మాదాపూర్ సామూహిక అత్యాచారాల సంఘటనల తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలు, అసభ్య ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలు తగ్గలేదని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందుకు తగ్గలేదు..

ఎందుకు తగ్గలేదు..

పోలీసులు చురుగ్గా వ్యవహరించినప్పటికీ మహిళలపై నేరాలు ఎందుకు తగ్గలేదని కెటిఆర్ అడుగుతూ మగ పిల్లల ప్రవర్తనను మార్చి, మహిళలను గౌరవించే సంస్కృతిని వారిలో నెలకొల్పాలని అన్నారు.

జెండర్ న్యూట్రల్ పోలీసు..

జెండర్ న్యూట్రల్ పోలీసు..

పోలీసులను ఉపయోగించడానికి బదులు లైంగిక తటస్థత పాటించే అధికారిని ఉపయోగించాలని ఆయన జెండర్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతూ అన్నారు.

33 శాతం రిజర్వేషన్లు

33 శాతం రిజర్వేషన్లు

పోలీసు రంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం డిజిపి అనురాగ్ శర్మ సూచనలు తీసుకుంటుందని కెటిఆర్ చెప్పారు.

పోలీసులపై ప్రశంసలు

పోలీసులపై ప్రశంసలు

ఇటీవల పోలీసులు నిర్వహించిన కార్డాన్ సెర్చ్ ఆపరేషన్లను, స్నేక్ గ్యాంగ్ లాంటి ముఠాల పట్టివేతను కెటిఆర్ ప్రశంసించారు.

మహిళా పోలీసు స్టేషన్

మహిళా పోలీసు స్టేషన్

ఔటర్ రింగ్ రోడ్డులోని గచ్చిబౌలిలో కెటిఆర్ మహిళా పోలీసు స్ఠేషన్‌ను ప్రారంభించారు. మరో పోలీసు స్టేషన్‌ను ట్రిపుల్ ఐటి వద్ద ప్రారంభించారు.

పోలీసులకు అదనపు బస్సులు...

పోలీసులకు అదనపు బస్సులు...

మారుమూల ప్రాంతాలకు కూడా అధికారులు వెళ్లడానికి 15 కొత్త బస్సులను సమకూర్చనున్నట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.

వుమెన్ కౌన్సెలర్..

వుమెన్ కౌన్సెలర్..

రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో వుమెన్ కౌన్సెలర్లను నియమించనున్నట్లు డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. పోలీసులకు సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సిసిటివి కెమెరాలు...

సిసిటివి కెమెరాలు...

ఐటి కారిడార్‌లో సిసిటివి కెమెరాల ఏర్పటు పనులు చురుగ్గా సాగుతున్నాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

సిసిటివి కెమెరాలు...

సిసిటివి కెమెరాలు...

ఐటి కారిడార్‌లో సిసిటివి కెమెరాల ఏర్పటు పనులు చురుగ్గా సాగుతున్నాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

English summary
Telangana state IT and panchayat raj minister K.T. Rama Rao on Wednesday asked the state police to increase its presence on social media in order to increase interaction with people. He said that the DGP and police commissioners should have Twitter accounts so that people could directly reach them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X