వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: తొందరొద్దని టీడీపీకి జగన్, ఏపీ మెట్రోకి శ్రీధరన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kalva Srinivasulu meets YS Jagan
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కలిశారు. రాష్ట్ర విభజన అనంతర సమస్యల పైన అసెంబ్లీలో 344 సెక్షన్ కింద తెలుగుదేశం పార్టీ నోటీసు పైన సభలో చర్చిద్దామని కాల్వ శ్రీనివాసులు కోరారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన చర్చిద్దామని జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే, ఈ అంశం మీద సమగ్రంగా చర్చించాల్సి ఉంటుందని, హడావుడిగా చర్చ వద్దని వైయస్ జగన్ అన్నారు. అందువల్ల మరో రోజు చర్చిద్దామని చెప్పారు.

ఏపి మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ శ్రీధరన్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. శ్రీధరన్ నియామకం పైన ఒకటి రెండు రోజుల్లో అధఇకారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్ వ్యవహరిస్తారు. అంతకుముందు శ్రీధరన్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బేటీ అయ్యారు. ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుల పైన చర్చించారు.

English summary
AP Government chief whip Kalva Srinivasulu meets YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X