వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల విభజనపై కమిటీ: ఒంటరి మహిళలకి ఆప్షన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kamalnathan Committee options for women employees
ఢిల్లీ: ఢిల్లీలోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం శుక్రవారం ముగిసింది. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీపై విధివిధానాలను కమల్‌నాథన్ కమిటీ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెబ్‌సైట్లో ఉంచుతామని కమిటీ తెలిపింది.

రెండు రోజుల్లో విధివిధానాలను వెబ్‌సైట్లో ఉంచనున్నారు. విధివిధానాల పైన ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తెలుపాలని కమిటీ తెలిపింది.

స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంటుందని చెప్పింది. దంపతులు, ఒంటరి మహిళలకు మాత్రమే ఆప్షన్లు ఉంటాయని కమల్ నాథన్ కమిటీ పేర్కొన్నదని సమాచారం.

ఒకటి రెండు ఏళ్లలో పదవీ విరమణ పొందే వారికి ఆప్షన్లు ఉండవని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 371డీ ప్రకారం స్థానికతను నిర్ధారిస్తామని కమిటీ పేర్కొందని తెలుస్తోంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావులు పాల్గొన్నారు.

English summary
Kamalnathan Committee may give options for women employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X