వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరంతో పెను ముప్పు: కవిత, కెసిఆర్ రివ్యూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha warns threat with Polavaram
న్యూఢిల్లీ/ హైదరాబాద్: గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత లోక్‌సభలో అన్నారు. కేంద్రం ఏరాష్ట్రాన్ని సంప్రదించకుండా పోలవరంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని ఆమె అన్నారు. ప్రాజెక్టుకు ఇష్టాను సారంగా అనుమతులు ఇవ్వడం సరికాదని ఎంపీ కవిత సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం జరగలేదని కవిత అన్నారు.

రాష్ట్ర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గురువారం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమయ్యారు. పోలీస్ లోగో, యూనిఫామ్, కొత్త వాహనాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో పోలీసు శాఖలో మార్పులు చేర్పులపై హోంశాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు.

హైదరాబాద్ పరిధిలో ఉన్న పోలీసు శాఖలో పలు సంస్కరణలకు కెసిఆర్ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు కూడా విడుదల చేశారు. 15 రోజుల్లో కొత్త వాహనాలను కెసిఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

English summary

 Telangana Rastra Samithi (TRS) MP Kalwakuntla Kavitha warned threat with Polavaram project proposed on Godavari river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X