వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో ఢీ: దక్షిణాది రాష్ట్రాల వైస్‌గా కేసీఆర్, ఏపీని లీడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దక్షిణాది జోనల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ను వైస్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవలే దక్షిణాది జోనల్‌లో చేరిన తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి వైస్ చైర్మన్‌గా నియామకం కావడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం దక్షిణాది జోనల్ ఏర్పడింది. దీనికి కేంద్ర హోంమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

KCR appointed as the Southern zone's Vice Chairman!

ఇప్పుడు దక్షిణాది జోనల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలను లీడ్ చేయనున్నారు. ఈ రాష్ట్రాలకు చెందిన అభిప్రాయాలను ఆయన కేంద్రానికి సమర్పిస్తారు. అంతేకాదు, కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం జరిగే పలు సమావేశాలు, సమ్మిట్‌లలో కేసీఆర్ పాల్గొంటారు.

దక్షిణాది జోనల్ వైస్ చైర్మన్‌గా నియమింపబడిన కేసీఆర్ ఏడాది పాటు ఈ పదవిలో ఉంటారు. ఈ సమయంలో చైర్మన్‌గా ఉన్న రాజ్ నాథ్ సింగ్‌తో కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. కాగా, విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పలు సమస్యలు పరిష్కరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఎన్డీయేలో ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ దక్షిణాది జోనల్ వైస్ చైర్మన్ అయ్యారు.

English summary
Telangana Chief Minister KCR has been appointed as the Southern Zonal vice Chairman by the Central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X