వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ కలల ప్రాజెక్ట్: జగదీశ్, రీఎంబర్స్‌మెంట్‌పై రేవంత్

|
Google Oneindia TeluguNews

 KCR dream project 'KG to PG free education': Jagadeesh
హైదరాబాద్: కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య ఎన్నికల నినాదం కాదని.. అది తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కలల ప్రాజెక్టు అని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లల్లో పరీక్షల కోసమే బట్టీ పట్టిస్తున్నారని అన్నారు. దేశంలోనే విప్లవాత్మక విద్యా వ్యవస్థగా తెలంగాణ రూపొందుతోందన్నారు.

ఫీజుల సమస్యను పరిష్కరించాలి: రేవంత్ రెడ్డి

విద్యార్థులకు ఫీజులు చెల్లించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదంపై చర్చించేందుకు నగరంలోని కత్రియా హోటల్‌లో కాలేజీల యాజమాన్యాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. అఖిలపక్షం నాయకులు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు.

ఈ సమాశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన అంశాన్ని ఆర్థిక అంశాలతో ముడిపెట్టొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మనం విద్యార్థుల కోసం ఖర్చు చేసేది 4వేల కోట్లేనని ఆయన చెప్పారు. తెలంగాణను పునర్నిర్మించాలంటే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంటును కొనసాగించాలని అన్నారు. ఫీజులు చెల్లించేందుకు సిఎం నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరూ తమ ఆస్తులనమ్మడం లేదని అన్నారు. ప్రభుత్వం అన్ని సరిచూసుకుని ఫీజులు చెల్లించాలని అన్నారు.

ఈ విషయంపై ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కూడా సిఎంను కలవాలని సూచించారు.
నిపుణులు, సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిని సిఎం కెసిఆర్ ఈ సమస్యపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి కోరారు. శాసనసభను ఏర్పాటు చేసి ఈ సమస్యపై చర్చ జరపాలని, తాము చర్చలో పాల్గొంటామని చెప్పారు. తమ పార్టీ అధినేత, ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కలిసి ఈ విషయంపై మాట్లాడతామని చెప్పారు. కాగా, రౌండ్ సమావేశంలో తెలంగాణ సిఎం కెసిఆర్‌ను కలవాలని కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.

కమలనాథన్ కమిటీతో టిఎన్జీవోల భేటీ

ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపుపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీతో శనివారం టిఎన్జీవో నేతలు భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనలో కమిటీ వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విభజన ప్రక్రియ ఏపి డిఏడికి అప్పగించడం సరికాదని, ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు.

అక్టోబర్ 31 నాటికి ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని టిఎన్జీవోలు డిమాండ్ చేశారు. అదే విధంగా తెలంగాణలో ఉన్న వారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని, ఏపిలో అదనంగా ఉన్న ఉద్యోగులను ఇక్కడికి పంపవద్దని కోరారు. భార్యాభర్తలు తెలంగాణ వారైతే ఇక్కడ పని చేసేందుకే అర్హులుగా ప్రకటించాలన్నారు.

English summary
Telangana Minister Jagadeesh Reddy on Saturday said that CM K Chandrasekhar Rao dream project is that 'KG to PG free education'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X