హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా వాల్యూ పొగొట్టొద్దు: కేసీఆర్, ఫిక్సింగ్: బాబుపై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR focus on stabilising, expanding industries
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. ఈ సమయంలో ఆయన నవ్వుతూ.. తన వ్యాల్యూ పోగొట్టవద్దని చమత్కరించారు. పారిశ్రామికవేత్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. పరిశ్రమలకు విద్యుత్ కోతల ముందు సమాచారం ఇస్తామన్నారు. తెలంగాణ ఈఆర్సీ రావాల్సి ఉందన్నారు.

చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరముందని చెప్పారు. పక్క రాష్ట్రాలలో పన్ను రాయితీ పైన అధ్యయనం చేస్తామని, వాటి కంటే 25 శాతం తక్కువగా ట్యాక్స్ ఉండేలా చూస్తామన్నారు. ఇప్పుడున్న ఇంజనీరింగ్ విద్యా విధానం సరిగా లేదన్నారు. మైనార్టీ కాలేజీల్లో 70 శాతం మైనార్టీలు ఉండాలని కానీ, పది శాతం కూడా ఉండటం లేదన్నారు. ఇన్‌స్పెక్షన్ చేద్దామంటే అడుగు పెట్టనివ్వరన్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్స్ కోసమే కొందరు ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టారన్నారు. ల్యాబులు కూడా లేని కాలేజీలు ఉన్నాయన్నారు. నాణ్యమైన విద్య కోసం సలహాలు తీసుకుంటామని చెప్పారు. మహీంద్రా ట్రాక్టర్స్ విడిభాగాలను ఇక్కడే తయారు చేయాలని కోరుతామన్నారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉందని, వచ్చే ఏడాదికల్లా రెండువేల మెగావాట్ల విద్యుత్ వస్తుందన్నారు. హైదరాబాదును అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. దేశంలోనే తెలంగాణది ఉత్తమమైన పారిశ్రామిక విధానం అవుతుందని చెప్పారు.

అన్ని పథకాలను కళ్యాణ్ లక్ష్మిలా డిజైన్ చేస్తామన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అన్ని రంగాలలో ముందుకు పోవాలన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు పరిశ్రమలను కాపాడటానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాదును ఫార్మా ఇండస్ట్రీ హబ్‌గా మారుస్తామన్నారు. కలెక్టరేట్లలో సింగిల్ విండో సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమ శాఖను నా వద్దే ఉంచుకొని నిరంతరం పర్యవేక్షిస్తానని చెప్పారు. చిన్న తరహా పరిశ్రమలకు రూ.800 కోట్లు పరిశీలన తర్వాత చెల్లిస్తామన్నారు. మొదట వందమంది దళిత పారిశ్రామికవేత్తలకు వంద కోట్లు ఇస్తామన్నారు.

మ్యాచ్ ఫిక్సింగ్: బొత్స

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోటయ్య కమిటీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు రుణమాఫీ పైన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. లక్షన్నర మాఫీ చేస్తామని ప్రకటించడం మ్యాచ్ ఫిక్సింగే అన్నారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు మాట తప్పారన్నారు.రుణమాఫీ పైన చంద్రబాబుది మాటల గారడీ అన్నారు. రుణమాఫీ అమలులో దివాళాకోరుతనం చూపడం సరికాదన్నారు. మాట ప్రభుత్వం తప్పటడుగులు వేస్తే తాము ప్రజల తరఫున ఉద్యమిస్తామని చెప్పారు.

English summary
Telangana CM KCR focus on stabilising, expanding industries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X