వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! మీ ఊళ్లో సర్టిఫికేట్ తెస్తావా: కిషన్ రెడ్డి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy asks KCR nativity certificate
హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం విమర్శలు గుప్పించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు తెరాస ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.

పథకంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. 1956 స్థానికతతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తోందన్నారు. 1956 స్థానికత నేపథ్యంలో కేసీఆర్ తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా? అని సూటిగా ప్రశ్నించారు. దాంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని హితవు పలికారు.

తెలంగాణ విద్యార్థులకే: కేసీఆర్ స్పష్టీకరణ

అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతకుముందు సమావేశంలో అన్నారు. అందరికీ ఫీజు రీయింబర్స్ చేస్తే ఇతర రాష్ట్రాల వారు కూడా అడుగుతారన్నారు. కేవలం తెలంగాణ విద్యార్థులకే బోధనా రుసుము చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ ప్రభుత్వం పైన కత్తి పెట్టినట్లుగా ప్రవర్తిస్తున్న తీరు అందరు చూస్తున్నారన్నారు.

కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పకుండా.. మహారాష్ట్ర నుండి వచ్చిన వారు కూడా తమ ఫీజులు కట్టమంటే ఎలా కడతామన్నారు. నేటివిటీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్నారు. ఇప్పుడు చిన్న పొరపాటు చేస్తే భవిష్యత్తు తెలంగాణ నష్టపోతుందన్నారు. హౌస్ హోల్ట్ సమగ్ర సర్వే సన్నాహక సదస్సులో కేసీఆర్ పునరుద్ఘాటించారు.

English summary

 BJP chief Kishan Reddy asked Telangana State CM on his ceriticate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X