వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వచ్ఛ భారత్: రోడ్లూడ్చిన కిషన్, రైల్వే జిఎం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హైదరాబాదులో గురువారం రోడ్లు ఊడ్చారు. పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన రోడ్లు ఊడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తామని రైల్వే జిఎం శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణికులకు పరిశుభ్ర వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. గురువారంనాడు కాచిగుడా రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ బారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో సమర్థంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని శ్రీవాస్తవ చెప్పారు.

పార్లమెంటు సభ్యుడు నంది ఎల్లయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో కుర్చీలు, మంచినీటితో పాటు పరిశుభ్ర వాతావరణాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎం రాకేష్ ఆరోస్ తదితరులు పాల్గొన్నారు.

కిషన్ రెడ్డి చెత్త ఎత్తారు...

కిషన్ రెడ్డి చెత్త ఎత్తారు...

తెలంగాణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గురువారంనాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేయించారు..

ప్రతిజ్ఞ చేయించారు..

స్వచ్ఛ భారత్ కోసం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, శాసనసభ్యుడు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.

చెత్త ఎత్తారు...

చెత్త ఎత్తారు...

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి రోడ్లు ఊడ్చి, చెత్త ఎత్తి, తట్టల్లో నింపి, పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు.

పార పట్టారు..

పార పట్టారు..

తెలంగాణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు స్వచ్ఛ భారత్‌లో భాగంగా పార పట్టి చెత్త ఎత్తి తట్టల్లో నింపారు.

తలకు రుమాలు చుట్టి...

తలకు రుమాలు చుట్టి...

తెలంగాణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పార పట్టి చెత్త ఎత్తి తట్టల్లో నింపారు. తలకు రుమాలు చుట్టి కార్యక్రమలో పాల్గొన్నారు.

English summary
Telangana BJP president kishan reddy participated in roads cleaning in Swachcha Bharath in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X