వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెత్తనం కోసమే: కోదండ, కేసీఆర్ వెనుక ఎవరు: బీజేపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram praises KCR and lashes out at AP government
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా సీమాంధ్ర నాయకులు తెలంగాణపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఛైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు. కేంద్రంలో పలుకుబడిన ఉపయోగించుకుని సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కడుతోందన్నారు.

తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందని, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు అప్పగించడాన్ని సహించేది లేదన్నారు. పోలవరం ముంపు మండలాల ప్రజలకు అండగానిలుస్తామని, ఈ మండలాలను ఆంధ్రలో కలుప వద్దన్నారు. కాగా, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం బాగా పని చేస్తోందని కితాబిచ్చారు.

కేసీఆర్ వెనుక ఎవరు?

వాహనాల నెంబర్ల మార్పు అన్నారని, అమలు చేయడం లేదంటూ కోర్టుకు వివరణ ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వ లోగో రూపకల్పనలో ముందుగా ప్రకటన చేశారని, ఆ తర్వాత వివరణ ఇచ్చి సవరణ చేశారని, అక్రమ కట్టడాలను సహించేది లేదని ప్రకటించారని, కొన్నిటిని కూల్చివేశారని, ఇప్పుడు కూల్చివేతలపై ముందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని, సమగ్ర కుటుంబ సర్వేలో అందరూ వివరాలు చెప్పాల్సిందేనని చెప్పారని, అంతలోనే స్వచ్ఛందమని కోర్టుకు వివరణ ఇచ్చారని.. ఇదంతా కేసీఆర్‌ పాలనంతా తడబాటేనని, ముందుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం, ఆ పిమ్మట సవరించుకోవడమేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు.

అసలు కేసీఆర్ వెనక ఉండి నడిపిస్తున్న శక్తులెవరో బయటపడాలన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్‌ తీసుకున్న 13 నిర్ణయాల్లో తడబాటు తప్ప, ఎందులోనూ స్పష్టత, కచ్చితత్వం కనిపించడం లేదన్నారు. ఉద్యమంలో ప్రదర్శించిన విజ్ఞతను కేసీఆర్‌ పాలనలో ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారన్నారు. కేసీఆర్‌ నిర్ణయాలు అవగాహనారాహిత్యం, అనాలోచితం, దక్షత లేని తనానికి నిదర్శనగా నిలుస్తున్నాయన్నారు.

పేకాట క్లబ్బులను నడవనివ్వమని చెప్పారని, ప్లేబాయ్‌లాంటి క్లబ్బులకు అనుమతి ఇచ్చారన్నారు. విద్యార్థులందరికీ ఫీజులు చెల్లిస్తామని, ఎంత మొత్తమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారని, ఇప్పుడేమో లేని పోని నిబంధనలు విధిస్తున్నారన్నారు. మెట్రో రైలు పనులు సాగనివ్వమని చెప్పి, మళ్లీ పనులకు పచ్చజెండా ఊపారని, పైగా 200 కిలోమీటర్ల వరకు పొడిగిస్తామంటున్నారన్నారు.

బడ్జెట్‌ సమావేశాల పైనా స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఇలా కేసీఆర్‌ ప్రభుత్వం ఏ అంశంలోనూ ఒక ఇతమిత్థమైన విధానాన్ని అమలు చేయలేకపోతోందని దెప్పిపొడిచారు. ఏవైనా విధానాలను ప్రకటించడానికి ముందు వాటిపై సమగ్రంగా చర్చించి ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ అనుభవం, సమర్థత ఎక్కడికి పోయాయన్నారు. అసలు ఆయన వెనక ఉండి నడిపిస్తున్నదెవరో.. ఆయనకు సలహాలు ఇస్తున్నదెవరో తేలాలన్నారు.

English summary
TJAC Chariman Kodandaram praises KCR and lashes out at AP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X